Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: మెడికల్ కాలేజీల్లో కోటాపై సుప్రీం సంచలన తీర్పు

By:  Tupaki Desk   |   26 Oct 2020 5:00 PM IST
బ్రేకింగ్: మెడికల్ కాలేజీల్లో కోటాపై సుప్రీం సంచలన తీర్పు
X
తమిళనాడు రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైన పిటీషన్లపై సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తమ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి 50శాతం ఓబీసీ కోటాకు అనుమతించాలంటూ తమిళనాడు ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది.

ఇప్పటికే ఈ రిజర్వేషన్లో సుప్రీంకోర్టు విచారించింది. రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని.. ప్రస్తుతం ఉన్న చట్టాలు అదే చెపుతున్నాయని జూన్ లో విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

తమిళనాడులోని మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఆల్ ఇండియా కోటాలో ఓబీసీలకు 50శాతం రిజర్వేషన్ కల్పించడం లేదంటూ సీపీఐ, డీఎంకే సహా పలు పార్టీల నేతలు సుప్రీం కోర్టులో పలు పిటీషన్లను దాఖలు చేశారు.

తమిళనాడులో ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలకు 69 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, ఇందులో ఓబీసీలకు 50 శాతం కేటాయించారని పిటిషనర్లు కోర్టుకు చెప్పారు. 2020–21 సంవత్సరానికిగానూ కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లు మినహా మిగతా మెడికల్, డెంటల్ కాలేజీల్లో పీజీ, డిగ్రీ కోర్సుల్లో ఆలిండియా కోటా కింద ఓబీసీలకు కచ్చితంగా 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఓబీసీ క్యాండిడేట్లకు అడ్మిషన్లు నిరాకరించడం వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని, అందువల్ల రిజర్వేషన్లు కల్పించే వరకూ నీట్ కౌన్సెలింగ్పై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు.

అయితే తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటీషన్ తోపాటు ఈ పీటీషన్లను విచారించిన సుప్రీం కోర్టు తాజాగా సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ పిటీషన్లను కొట్టివేసింది. మెడికల్ కాలేజీల్లో 50శాతం కోటా చెల్లదంటూ చారిత్రక తీర్పును ఇచ్చింది.