Begin typing your search above and press return to search.
గంగానదిలో మృతదేహాలు.. సుప్రీం షాకింగ్ కామెంట్స్
By: Tupaki Desk | 28 Jun 2021 11:00 PM ISTదేశంలో సెకండ్ వేవ్ వేళ పవిత్ర గంగా నదిలో శవాలు కొట్టుకొచ్చిన తీరు దేశవ్యాప్తంగా అందరినీ కలిచివేసింది. అవన్నీ కోవిడ్ మరణాలేనని.. కాల్చలేక నదిలో వేశారని ఆరోపణలు వచ్చాయి. దేశంలో మేనెలలో రోజుకు 3-4వేల మంది అధికారికంగా చనిపోయారని.. ఆ సమయంలో గంగానదిలో మృతదేహాలు కొట్టుకురావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
బీహార్ , యూపీ పరివాహక ప్రాంతాల్లో పలు మృతదేహాలు బయటపడ్డాయి. ఇసుకలో ఖననం చేసిన మృతదేహాలు పెద్దసంఖ్యలో బయటపడిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ లో కాల్చడానికి, పూడ్చడానికి మౌలిక వసతులు లేక చాలా మంది శవాలను గంగానదిలో వదిలేశారని ఆరోపణలు వచ్చాయి.
దీనిపై తాజాగా సుప్రీంకోర్టులో డిస్ట్రస్ మేనేజ్ మెంట్ కలెక్టివ్ అనే స్వచ్ఛంద సంస్థ పిటీషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు దీనిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది ‘చాలా తీవ్రమైన సమస్య’ అటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. చనిపోయిన వారి హక్కులను పరిరక్షించడానికి ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశఆమని.. జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాలని పిటీషనర్ కు సూచించింది.
ఇక పవిత్ర గంగానదిలో మృతదేహాలు పడేయడం సమాజానికి సిగ్గుచేటు అని జాతీయ మానవహక్కుల కమిషన్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇది మృతిచెందిన వ్యక్తుల మానవ హక్కుల ఉల్లంఘనే అని కమిషన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
సెకండ్ వేవ్ లో కరోనా కోరలు చాచింది. ఉత్తరప్రదేశ్ లో అయితే వేల మందికి సోకి వందల మంది ప్రాణాలు తీసింది. ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ మీదుగా వెళ్లే గంగానదిలో ఇటీవల కొన్ని మృతదేహాలు బయటపడ్డాయి. 100 వరకు శవాలను గంగానదిలో పడేశారు. గ్రామాల్లో, పట్టణాల్లో అంత్యక్రియలకు చోటు లేక కొందరు.. కోవిడ్ మృతదేహాలను ఎవరూ తీసుకుపోకపోవడంతో మరికొందరు ఇలా పవిత్ర గంగానదిలో మృతదేహాలు వదిలేసి ఉంటారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇది దేశవ్యాప్తంగా అందరినీ శోకసంద్రంలో ముంచింది.