Begin typing your search above and press return to search.
టెలికం కంపెనీల పై సుప్రీం మహా సీరియస్.. ఘాటు వ్యాఖ్యలు
By: Tupaki Desk | 14 Feb 2020 5:00 PM ISTదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో సుప్రీం సీరియస్ అయ్యింది. తామిచ్చిన ఆదేశాలు అమలు కాక పోవటాన్ని ప్రశ్నించింది. టెలికం కంపెనీలు ఏజీఆర్ ఛార్జీల కింద బకాయి పడ్డ రూ.92వేల కోట్లను ఎందుకింకా చెల్లించ లేదని ప్రశ్నించింది.
కోర్టు ఆదేశాల్ని ఎందుకు పాటించలేదన్న ప్రశ్నతో పాటు.. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని టెలికం శాఖను నిలదీసింది. అదే సమయంలో బకాయిల్ని వసూలు చేయటంలో కేంద్ర వైఫల్యాన్ని ప్రశ్నించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వానికి బకాయిలు చెల్లించాల్సిన టెలికం కంపెనీల్లో భారతీ ఎయిర్ టెల్.. వొడాఫోన్.. ఎంటీఎన్ఎల్.. బీఎస్ఎన్ఎల్.. రిలయన్స్ కమ్యూనికేషన్.. టాటా టెలి కమ్యునికేషన్ సంస్థలతో పాటు మరికొన్ని ఉన్నాయి.
అయితే.. బకాయిలు చెల్లించకుండా ఉంటానికి కారణం టెలికం శాఖలోని కొందరు అధికారులుగా సుప్రీం గుర్తించింది. బకాయిలు చెల్లించని కంపెనీల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని.. సంస్థలపై బకాయిల చెల్లింపు కోసం ఒత్తిడి తేవొద్దంటూ ఉన్న లేఖలు కోర్టు ముందుకు వచ్చాయి. వీటిని పరిశీలించిన సుప్రీం ధర్మాసం మరింత సీరియస్ అయ్యింది.
తమ తీర్పును అమలు కాకుండా లేఖలు ఎవరు ఇస్తున్నారని ప్రశ్నించింది. అంతేకాదు.. అసలీ దేశం లో న్యాయం ఉందా? అని ప్రశ్నించింది. ఈ నాన్సెన్స్ పనులు ఎవరు చేస్తున్నారో తమకు అర్థం కావటం లేదన్న కోర్టు.. తమ ఆదేశాల్ని అమలు కాకుండా అడ్డుపడుతున్న వారు ఈ దేశంలో జీవించటం కంటే విడిచి పెట్టి వెళ్లటం మేలేమో అంటూ తీవ్ర వ్యాఖ్యల్ని చేసింది. సుప్రీంకోర్టు తాజా ఆగ్రహం చూస్తే.. టెలికం సంస్థలకు మరిన్ని తిప్పలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.