Begin typing your search above and press return to search.

విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం తీర్పు

By:  Tupaki Desk   |   3 Jun 2020 5:29 PM IST
విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం తీర్పు
X
తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఆరు సంవత్సరాలు అవుతున్నా ఇంకా విభజన గొడవలు సద్దుమణగడం లేదు. ఎన్నో తెగని పంచాయితీలు రెండు రాష్ట్రాల మధ్యన ఉన్నాయి.. ముఖ్యంగా నీళ్ల పంచాయితీతోపాటు ఉద్యోగుల విభజన ఇప్పటికీ కొలిక్కి రావడం లేదు.

తాజాగా తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం కోర్టు విచారించింది. ఏపీ నుంచి రిలీవ్ అయిన సుమారు 300 మంది ఉద్యోగులు న్యాయస్థానంలో మధ్యంతర అప్లికేషన్ దాఖలు చేశారు.

తమ అనుమతి లేకుండా ఏపీ నుంచి రిలీవ్ చేసి తెలంగాణకు కేటాయించారని.. తాము ఏపీలోనే కొనసాగుతామని ఉద్యోగులు పిటీషన్ లో పేర్కొన్నారు.

దీనిపై జస్టిస్ అశోక్ భూషణ్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ వివాదాన్ని తాము ఎటూ తేల్చలేమని.. తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల కేటాయింపులపై అభ్యంతరాలను జస్టిస్ ధర్మాధికారి కమిటీ ముందే తేల్చుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక్కో పిటీషన్ ను తాము వేర్వేరుగా విచారించలేమని ధర్మాసంన పిటిషనర్ కు తెలిపింది.