Begin typing your search above and press return to search.

సుప్రీం చారిత్రక తీర్పు.. 24 వారాలకు సైతం అబార్షన్ కు ఓకే

By:  Tupaki Desk   |   23 July 2022 4:43 AM GMT
సుప్రీం చారిత్రక తీర్పు.. 24 వారాలకు సైతం అబార్షన్ కు ఓకే
X
చారిత్రక తీర్పును వెల్లడించింది దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు. ఒక కేసు విచారణలో భాగంగా ఇప్పటివరకు ఉన్న నిబంధనల్ని సవరిస్తూ తాజా తీర్పును ఇవ్వటం గమనార్హం. ప్రత్యేక పరిస్థితుల్లో గర్భం దాల్చిన వారికి 20 వారాల వరకు అబార్షన్ చేయించుకునే వీలుంది. దాన్ని 24 వారాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకించిన హైకోర్టు తీర్పును కొట్టేస్తూ.. తాజాగా నిర్ణయాన్ని వెల్లడించింది.

20 వారాల గర్భవిచ్చిత్తి (అబార్షన్) అంటే శిశువును చంపేయటమేనన్న హైకోర్టు తీర్పు తప్పుగా తేల్చింది. లైంగిక హింస కేసుల్లో గర్భం దాల్చిన ఒంటరి మహిళలు 20 వారాల వరకు అబార్షన్ చేయించుకునేందుకు ప్రస్తుత చట్టాలు వీలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాను గర్భం దాల్చిన తర్వాత తనతో సదరు వ్యక్తితో ఉన్న సంబంధంలో మార్పు వచ్చిన నేపథ్యంలో తన గర్భాన్ని విచ్ఛితి చేసుకోవటానికి అనుమతి ఇవ్వాలంటూ ఒక మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

ఈ కేసును విచారించిన హైకోర్టు.. పెళ్లి కాకుండానే సమ్మతితోనే గర్భం దాల్చిన నేపథ్యంలో.. 20 వారాల పిండాన్ని తీసేయటమంటే.. శిశువును చంపేయటంగా పేర్కొన్నారు. అంతేకాదు.. ఒక మంచి ఆసుపత్రిలో శిశువును కని.. అక్కడే వదిలేసి వెళ్లిపోవచ్చని.. దత్తత తీసుకోవటానికి చాలామంది ఎదురుచూస్తున్నారంటూ వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి.. 'ఈ వ్యవహారాన్నంతా ఆసుపత్రి చూసుకుంటుంది. అందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వం చెల్లించకుంటే నేనే భరిస్తా, అంటూ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇలాంటివేళ.. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. సదరు మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీన్ని విచారించిన సేుప్రీం త్రిసభ్య ధర్మాసనం.. హైకోర్టు తీర్పునకు భిన్నంగా పేర్కొంటూ 24 వారాల వరకు అబార్షన్ చేసుకునే అనుమతిని జారీ చేసింది. అంతేకాదు.. ఢిల్లీ హైకోర్టు తీర్పు.. "మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971"కు విరుద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. తాజాగా ఇచ్చిన తీర్పుతో.. ప్రత్యేక సందర్భాల్లో 24 వారాల వరకు అబార్షన్ ఓకేగా మారినట్లైంది.