Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే ల అనర్హత పై సుప్రీం సంచలన తీర్పు

By:  Tupaki Desk   |   13 Nov 2019 7:36 AM GMT
ఎమ్మెల్యే ల అనర్హత పై సుప్రీం సంచలన తీర్పు
X
కర్ణాకట కు చెందిన 17మంది ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర మాజీ స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ విధించిన అనర్హత వేటును సమర్థిస్తూ సుప్రీం కోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. స్పీకర్ ఉత్తర్వు ను తాము సమర్థిస్తున్నామని త్రిసభ్య ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రకటించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద జులైలో నాటి స్పీకర్ ఈ 17 మంది పై అనర్హత వేటు వేశారు. వీరి అసమ్మతి కారణం గానే , హెచ్‌డీ కుమార స్వామి నేతృత్వం లోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలి పోయింది.

ఇక పోతే దేశ అత్యున్యత న్యాయ స్థానం సుప్రీం కోర్ట్ .. కాంగ్రెస్‌-జేడీఎస్‌ కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటును సమర్థించినప్పటికీ.. వారిపై స్పీకర్‌ విధించిన అనర్హత కాలాన్ని కొట్టి వేసింది. ప్రస్తుత అసెంబ్లీ కాలం 2023 సంవత్సరం ముగిసే వరకు అనర్హత ఎమ్మెల్యే లు పోటీ చేయ రాదని స్పీకర్‌ నిబంధన విధించ గా.. ఈ నిబంధనను సుప్రీం కోర్టు కొట్టేసింది. దీని తో అనర్హత కు గురైన 17మంది ఎమ్మెల్యే లు రానున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి మార్గం సుగమం అయ్యింది.

ఆర్టికల్‌ 193ని చర్చించిన అనంతరం అనర్హత అంశం లో మేం ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. అనర్హత అనేది.. చర్య జరిగిన కాలానికి మాత్రమే వర్తిస్తుంది. ఒక వ్యక్తి కొంత కాలంపాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ ఆదేశాలు ఇచ్చే అధికారం స్పీకర్‌ కు లేదు అని న్యాయ స్థానం అభిప్రాయ పడింది. స్పీకర్‌ విధించిన అనర్హత వేటును మేం సమర్థిస్తున్నాం. అయితే, అనర్హత కాలాన్ని మాత్రం కొట్టి వేస్తున్నాం అని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తన తీర్పు లో వెల్లడించింది. గత ప్రభుత్వం కూలి పోవడానికి కారణమైన 17మంది ఎమ్మెల్యేల పై అప్పటి స్పీకర్‌ అనర్హత వేటు వేశారు. దీనిపై సదరు ఎమ్మెల్యే లు సుప్రీంకోర్టు లో సవాలు చేయగా.. జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ కృష్ణమురారీతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ పై విచారణ జరిపి.. అక్టోబర్‌ 25న తీర్పును రిజర్వు లో ఉంచిన సంగతి తెలిసిం‍దే. ఆ తీర్పుని నేడు వెల్లడించింది. దీనిపై మాట్లాడిన సీఎం యడ్డ్యూరప్ప ..వేటు పడ్డ 17 మంది ఉప ఎన్నికల్లో పోటీ చేయొచ్చని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు.