Begin typing your search above and press return to search.

సుప్రీం తాజా తీర్పు.. రోడ్డు ప్రమాదాలు చేసే వారిపైన ఐపీసీ సెక్షన్లు

By:  Tupaki Desk   |   8 Oct 2019 8:20 AM GMT
సుప్రీం తాజా తీర్పు.. రోడ్డు ప్రమాదాలు చేసే వారిపైన ఐపీసీ సెక్షన్లు
X
రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంటే మోటారు వాహనాల చట్టం కింద నేరం నమోదు చేయటం తెలిసిందే. అయితే.. ఇలాంటి వారిపైనా ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్) సెక్షన్ల కింద కూడా కేసులు పెట్టొచ్చన్న విషయాన్ని తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం స్పష్టం చేసింది. మితిమీరిన వేగం.. నిర్లక్ష్యం.. దురుసుగా వాహనాల్ని నడిపి ప్రమాదాలకు కారణమైన వారిపైనా మోటారు వాహన చట్టం కిందనే కేసులు నమోదు చేసేందుకు పరిమితం కాకుండా.. ఐపీసీ సెక్షన్ల కింద కూడా కేసులు పెట్టటం తప్పేం కాదని వెల్లడించింది.

రోడ్డు ప్రమాదాలకు కారణమైన వ్యక్తులపై మోటారు చట్టం ప్రకారం మాత్రమే కేసులు నమోదు చేయాలే తప్పించి.. ఐపీసీ సెక్షన్లు పెట్టొద్దంటూ గువాహాటి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కొట్టేసింది. 2008లో సదరు కోర్టు ఇచ్చిన తీర్పు చెల్లుబాటు కాదని వెల్లడించింది.

నేరానికి పాల్పడిన వ్యక్తి మీద ఐపీసీ.. మోటారు వాహన చట్టం రెండూ కూడా స్వతంత్ర పరిధుల్లో సంపూర్ణ శక్తివంతమైనవని వెల్లడించింది. మోటారువాహనాలు విపరీతంగా పెరుగుతున్న వేళ.. రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ ఎక్కువ అవుతు్న వేళ.. వారిపై ఐపీసీ సెక్షన్ల కిందా కేసులు నమోదు చేయొచ్చని సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ ఇందు మల్హోత్రా.. జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడాని దర్శాసనం వెల్లడించింది. సో.. మోటారు వాహన చట్టంతో పోలిస్తే.. ఐపీసీ చట్టాలు కఠినంగా ఉంటాయన్న విషయాన్ని మర్చిపోకూడదు.