Begin typing your search above and press return to search.
సుప్రీం సంచలన ఆదేశాలు.. ఇంటరాగేషన్ గదుల్లో సీసీ కెమేరాలు పెట్టాలి
By: Tupaki Desk | 3 Dec 2020 10:30 AM ISTదేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా సంచలన ఆదేశాల్ని జారీ చేసింది. తాము జారీ చేసిన ఆదేశాల్ని కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పింది. ఇంతకీ సుప్రీం ఆదేశాలేమిటన్న విషయంలోకి వెళితే.. పోలీసు శాఖ అధికారులకు షాక్ కు గురయ్యే ఆదేశాల్ని జారీ చేసింది.
ఇకపై నేరస్తుల్ని ఇంటరాగేట్ చేసే గదులు.. లాకప్ లు.. కార్యాలయాలు.. ఎంట్రీ.. ఎగ్జిట్ కేంద్రాల వద్ద.. మొయిన్ డోర్ వద్ద.. కారిడార్లు.. లాబీల వద్ద సీసీ కెమేరాల్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మానవ హక్కుల ఉల్లంఘనల్ని తనిఖీ చేసేందుకు వీలుగా పోలీస స్టేషన్లలో సీసీ టీవీ కెమేరాల్ని అక్కడే ఉంచాలని జస్టిస్.. ఆర్ఎఫ్ నారిమన్ లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
దీంతో.. నిందితుల్ని.. నేరస్తుల్ని విచారించే తీరు పూర్తిగా మారిపోనుంది. ఇకపై అన్ని పోలీస్ స్టేషన్లతో పాటు.. ఇతర ప్రాంతాల్లోనే సీసీ కెమేరాల్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రాత్రి వేళలో ఆడియో.. వీడియోలు రికార్డు జరిగే పరికరాల్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. సాధ్యమైనంత ఎక్కువ కాలం డేటాను దాచి పెట్టే సౌకర్యం ఉండాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
ఇప్పటివరకు చీకటి కొట్లుగా ఉండే లాకప్ గదుల్లో ఇప్పుడు అందుకు భిన్నంగా సీసీ కెమేరాల్ని ఏర్పాటు చేయమన్న సుప్రీం కోర్టు ధర్మాసనం తాజాగా ఆదేశాల్ని జారీ చేసింది. 2018లో పంజాబ్ లో జరిగిన కస్టోడియన హింస కేసు విచారణ నేపథ్యంలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయని వైనంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దేశంలోని అన్ని రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ మార్పులు చేర్పులు నేర విచారణ తీరును మార్చేస్తుందని చెప్పక తప్పదు.