Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి నారాయ‌ణకు ఊర‌ట‌.. ఆ కేసులో బెయిల్ మంజూరు

By:  Tupaki Desk   |   6 Jan 2023 6:38 PM IST
మాజీ మంత్రి నారాయ‌ణకు ఊర‌ట‌.. ఆ కేసులో బెయిల్ మంజూరు
X
నారాయ‌ణ విద్యాసంస్థ‌ల వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌కు సుప్రీంకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. వైసీపీ హ‌యాంలో గ‌త ఏడాది జ‌రిగిన ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు సంబందించి ప్ర‌శ్న ప‌త్రం లీకేజీ అయిన వ్య‌వ‌హారంపై సుప్రీం కోర్టు నారాయ‌ణ‌కు సానుకూలంగా తీర్పు ఇచ్చింది. తాజాగా ఈ పేప‌ర్ లీకేజీ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. నారాయ‌ణ‌కు బెయిల్ ర‌ద్దు చేయాల‌న్న హైకోర్టు ఆదేశాల‌పై స్టే ఇచ్చింది.

అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గత సంవత్సరంలో ఏప్రిల్‌ 27న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జడ్పీ హైస్కూల్‌లో పదోతరగతి ప్రశ్నపత్రం లీకైంది. వాట్సాప్‌ ద్వారా తెలుగు ప్రశ్నపత్రం బయటకు రావటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిలో నారాయణ పాత్ర ఉన్నట్లు చిత్తూరు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు.. వెంట‌నేకేసు కూడా పెట్టారు.

ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ నుంచి చిత్తూరుకు కారులో త‌ర‌లించారు. త‌న‌కు ఆరోగ్యం బాగోలేద‌ని.. చెప్పినా .. పోలీసులు వినిపించుకోలేదు. ఇక‌, చిత్తూరులోని స్థానిక కోర్టు ఈ కేసులో బెయిల్ ఇచ్చింది. అయితే.. దీనిని చిత్తూరు జిల్లా సీఐడీ పోలీసులు హైకోర్టులో స‌వాల్ చేశారు. దీనిని విచారించిన హైకోర్టు.. బెయిల్ ర‌ద్దు చేస్తూ.. ఉత్త‌ర్వులు ఇచ్చారు. అయితే.. దీనికి కొంత స‌మ‌యం ఇచ్చారు. ఇంత‌లోనారాయ‌ణ దీనిపై సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.

నారాయణ విద్యాసంస్థల అధినేతగా 2014లోనే నారాయణ వైదొలిగారంటూ ఆయన తరఫు న్యాయవా దులు కోర్టుకు తెలిపారు. దీంతో బెయిల్‌ రద్దు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రస్తుతం సుప్రీం కోర్టు స్టే విధించింది. నారాయ‌ణ త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది సిద్ధార్థ లూథ్రా వాద‌న‌లు వినిపించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.