Begin typing your search above and press return to search.

ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంలో చుక్కెదురు

By:  Tupaki Desk   |   26 Nov 2020 4:15 PM GMT
ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంలో చుక్కెదురు
X
గత చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ అధికారిగా ఉండి అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఆయన అక్రమాలపై నిగ్గుతేల్చి జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది. దీనిపై సుప్రీం కోర్టుకు ఎక్కారు ఏబీ వెంకటేశ్వరరావు.

తాజాగా ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన సస్పెన్షన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ పై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది.

చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరావు దేశభద్రతకు ముప్పు వాటిల్లేలా నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైకోర్టును ఆయన ఆశ్రయించగా సస్పెన్షన్ పై స్టే విధించింది.

జగన్ సర్కార్ వేసిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పును ఇవ్వగా.. దానిని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. నేడు విచారణ సందర్భంగా... ఏబీ ఉన్నత స్థానంలో ఉన్న కారణంగా నిఘా పరికరాల కేసు దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని, ఆయన సస్పెన్షన్‌పై హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాల్సిందిగా న్యాయస్థానానికి విన్నవించింది. ఈ క్రమంలో గురువారం అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.