Begin typing your search above and press return to search.

దుస్తుల పై నుండి స్తనాలు తాకితే తప్పు కాదు... హైకోర్టు తీర్పు పై సుప్రీం కోర్టు స్టే

By:  Tupaki Desk   |   27 Jan 2021 3:42 PM IST
దుస్తుల పై నుండి స్తనాలు తాకితే తప్పు కాదు... హైకోర్టు తీర్పు పై   సుప్రీం కోర్టు స్టే
X
2 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి సంబంధించిన కేసులో ఇటీవల బాంబే హైకోర్టులోని నాగపూర్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు తీవ్ర వివాదాస్పదంగా మారింది.దుస్తుల పైనుంచి బాలిక స్తనాలను తాకడాన్ని పోక్సో చట్టం కింద నేరంగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది. ఇదే కారణంతో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. బాంబే హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై తాజాగా సుప్రీం కోర్టు స్టే విధించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే నేత్రుత్వంలోని ధర్మాసనం స్టే ఉత్తర్వులు జారీ చేసింది.

'అక్కడ స్కిన్-టు-స్కిన్ కాంటాక్ట్ అనేది జరగలేదు కాబట్టి పోక్సో చట్టంలోని సెక్షన్ 8 కింద దీన్ని లైంగిక దాడిగా పరిగణించలేమని బాంబే హైకోర్టు పేర్కొంది. నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పుపై అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి తీర్పు ప్రమాదకరమని పేర్కొన్నారు. దీనిపై పిటిషన్‌ దాఖలు చేసేందుకు మేము ఆయనకు అనుమతినిస్తున్నాం. అప్పటివరకూ బాంబే హైకోర్టు తీర్పుపై స్టే కొనసాగుతుంది అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

కాగా,12 ఏళ్ల ఓ బాలికపై నాలుగేళ్ల క్రితం ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలున్నాయి. జామకాయ ఇస్తానని ఆశచూపి.. ఆ బాలికను ఇంట్లోకి తీసుకెళ్లిన అతను ఆమె స్తనాలను చేతులతో నొక్కడంతో పాటు పాక్షికంగా వివస్త్రను చేశాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం... కోర్టు అతన్ని దోషిగా తేల్చి జైలు శిక్ష విధించడం జరిగింది. అయితే ఆ తీర్పును అతను బాంబే హైకోర్టులోని నాగపూర్ సింగిల్ బెంచ్ కోర్టులో సవాల్ చేశాడు.

ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు... పోక్సో చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం... బాలిక పై భాగంలోని దుస్తులపై నుండి అతను స్తనాలను ప్రెస్ చేశాడా అన్నది పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. బాలిక ధరించిన దుస్తుల పైభాగం తొలగించబడిందా లేదా పైభాగం లోపల అతని చేతిని చొప్పించి ఆమె స్తనాలను తాకాడా అనే దానిపై నిర్దిష్ట వివరాలు లేనప్పుడు... ఈ చర్యను 'లైంగిక వేధింపు'ల నిర్వచనంలోకి తీసుకోలేము ..అని తెలిపింది.ఐపీసీ సెక్షన్‌ 354 కింద మాత్రమే అతడిని నేరస్థుడిగా గుర్తిస్తామని పేర్కొంది.