Begin typing your search above and press return to search.
డిస్ ఇన్ఫెక్షన్ టన్నెళ్ల వినియోగంపై నిషేధం
By: Tupaki Desk | 6 Nov 2020 2:40 PM ISTకరోనా కట్టడిలో డిస్ ఇన్ఫెక్షన్ టన్నెళ్లు బాగా పనిచేస్తాయని ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు తీసుకొచ్చి పెట్టుకున్నాయి. వాటి మధ్యలోంచి మనుషులు వెళితే కరోనా వైరస్ ఖతమవుతుందని అంతా భావించారు. అయితే డిస్ ఇన్ఫెక్షన్ టన్నెళ్ల వృథా ప్రయాసేనని తాజాగా సుప్రీం కోర్టు తేల్చేసింది. దేశంలో డిస్ ఇన్ఫెక్షన్ టన్నెళ్ల వినియోగాన్ని నిషేధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ టన్నెళ్ల నిషేధంపై మార్గదర్శకాలు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
నెలరోజుల్లోగా తప్పనిసరిగా మార్గదర్శకాలు విడుదల చేయాలని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో డిస్ ఇన్ఫెక్షన్ టన్నెళ్లను వినియోగిస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాపించడం.. దానికి మందు లేకపోవడం.. వైరస్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడ్డారు. దాని నివారణ, చికిత్సా విధానంపై వైద్య నిపుణులు కూడా ఓ స్పష్టమైన అవగాహన లేదు. దీంతో డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్స్ తో కరోనాను అరికట్టవచ్చని ప్రచారం సాగింది.
భారత్ లో లాక్ డౌన్ విధించిన తొలినాళ్లలో డిస్ ఇన్ఫెక్షన్ టన్నెళ్లను విరివిగా వాడారు. సోడియం హైపోక్లోరేట్ ద్రావణాన్ని సన్నటి ధారల్లాగా పిచికారీ చేసినట్టుగా ఈ డిస్ ఇన్ఫెక్షన్ టన్నెళ్ల ద్వారా మనుషుల శరీరంపై చల్లేవారు. ఆఫీస్ ల ముందు, మార్కెట్ల ముందు, పలు రద్దీ ప్రదేశాల్లో ఇలాంటి వాటిని పెట్టేవారు. రాను రాను ఇది ఓ పెద్ద వ్యాపారంగా మారిపోయింది. డిస్ ఇన్ఫెక్షన్ టన్నెళ్ల తయారీ, అందులో వాడే రసాయనాల అమ్మకం.. మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగింది.
అయితే దీనివల్ల వైరస్ అంతమవుతుందా? అనేది ఎక్కడా తేలలేదు. ఇక ఈ స్ప్రే వల్ల మానవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని తేలిందట.. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో డిస్ ఇన్ఫెక్షన్ టన్నెళ్ల వాడకం, ఉత్పత్తి, అమ్మకాలు, వాటికి సంబంధించిన ప్రకటనలపై నిషేధం విధించాలని కోరుతూ.. న్యాయశాస్త్ర విద్యార్థి గుర్‌సిమ్రన్ సింగ్ నరులా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన సుప్రీం కోర్టు దీనిపై నిషేధం విధిస్తూ నిర్ణయించింది.