Begin typing your search above and press return to search.

అయోధ్య తుది తీర్పునకు వేదికగా సుప్రీం కోర్టు రూమ్ నెంబరు వన్

By:  Tupaki Desk   |   9 Nov 2019 6:23 AM GMT
అయోధ్య తుది తీర్పునకు వేదికగా సుప్రీం కోర్టు రూమ్ నెంబరు వన్
X
యావత్ దేశం తో పాటు.. విదేశాల్లోని భారతీయులు.. కొన్ని దేశాలకు చెందిన ప్రజలు అయోధ్య అంశం పై దేశ అత్యున్నత న్యాయ స్థానం ఇవ్వనున్న తీర్పు ఏమై ఉంటుందన్న విషయం పై బోలెడంత ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం ప్రకారం అయోధ్య అంశంపై పిటిషన్లు దాఖలు చేసిన షియా బోర్డు వాదనను తోసిపుచ్చింది. వారు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టి వేసింది.

ఐదుగురు సభ్యులున్న ధర్మాసనం వెలువరిస్తున్న తీర్పును ఇప్పటి కే చదవటం షురూ చేశారు. తుది తీర్పును చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ చదువుతున్నారు. పూర్తి పాఠం చదివేందుకు అరగంట సమయం పడుతుందని చెబుతున్నారు. మసీదు ను బాబర్ నిర్మించారనే దానిని తాము సమర్థిస్తున్నట్లు గా కోర్టు పేర్కొంది. అయితే.. బాబ్రీ మసీదు ను ఎప్పుడు నిర్మించారో తెలీదన్నారు.

ప్రజల విశ్వాసాలను.. నమ్మకాల్ని గౌరవిస్తున్నట్లు చెప్పిన గోగోయ్.. మతగ్రంధాలకు అనుగుణంగా కోర్టు తీర్పు ఉండదని స్పష్టం చేశారు. తీర్పు పై ఐదుగురు జడ్జిలు ఏకాభిప్రాయం కుదరటంతో.. వారంతా తీర్పు కాపీ మీద సంతకం చేశారు.

మొత్తం తీర్పును చదవటానికి అరగంట సమయం పడుతుందని వెల్లడించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ చారిత్రక తీర్పునకువేదికగా సుప్రీం కోర్టు రూమ్ నెంబరు ఒకటి లో తీర్పును వెలువరించారు. తీర్పు ను వెల్లడించే సమయాని కి కాస్త ముందుగా వచ్చిన వారు.. ముందుగా పేర్కొన్న సమయానికి కాపీ చదవటం షురూ చేశారు.