Begin typing your search above and press return to search.

ఎన్నికేసుల్లో గెలిచారో చెప్పండి.. సీబీఐకి సుప్రీం ప్ర‌శ్న‌!

By:  Tupaki Desk   |   5 Sept 2021 1:00 PM IST
ఎన్నికేసుల్లో గెలిచారో చెప్పండి.. సీబీఐకి సుప్రీం ప్ర‌శ్న‌!
X
కేంద్ర ధ‌ర్యాప్తు సంఘం.. సీబీఐ. దేశ రాజ‌కీయాల్లో, సామాజిక వ్య‌వ‌హారాల్లో త‌ర‌చూ వినిపించే మాట‌. సీబీఐ అనే మాటే మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంది. ఏ సంచ‌ల‌న అంశం మీద అయినా.. సీబీఐ విచార‌ణ అనే మాట‌, సీబీఐ విచార‌ణకు ఆదేశించాల‌నే డిమాండ్ ప్ర‌ముఖంగా నిలుస్తూ ఉంది. ఏ కేసులో అయినా సీబీఐ విచార‌ణ మొద‌లైందంటే.. మీడియా కూడా దానికి చాలా ప్రాధాన్య‌త‌ను ఇస్తూ ఉంటుంది.

దేశంలోని రాజ‌కీయ నేత‌లు ఎదుర్కొంటున్న కేసులు, సంచ‌ల‌నాత్మ‌క నేరాల గురించి సీబీఐ విచార‌ణ‌లు పతాక శీర్షిక‌ల‌కు ఎక్కుతూ ఉంటాయి. సీబీఐ అనే మాటే చాలు, ఈ ఉపోద్ఘాత‌మంతా అవ‌స‌రం లేదు కూడా. అంత ప‌వ‌ర్ ఫుల్ సీబీఐ అంటే!

అయితే సీబీఐ టేక‌ప్ చేసిన కేసులు కూడా సుదీర్ఘంగా సాగుతాయ‌ని ప్ర‌తీతి. ద‌శాబ్దాల‌కు ద‌శాబ్దాలు సాగిన కేసులు కూడా ఉంటాయి వాటిల్లో. ఈ నేప‌థ్యంలో సీబీఐ ట్రాక్ రికార్డు గురించి వివ‌రాల‌ను అడిగింది సుప్రీం కోర్టు. కేంద్ర ధ‌ర్యాప్తు సంఘం ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నిక‌ల‌ను విజ‌య‌వంతంగా ప‌రిష్క‌రించిందో వివ‌రాల‌ను ఇవ్వాల‌ని సుప్రీం కోర్టు ధ‌ర్మాస‌నం అదేశించింది. ఇందుకు ఆరు వారాల గ‌డువును కూడా ఇచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కూ సీబీఐ ఎన్ని కేసుల‌ను చేప‌ట్టింది, వాటిల్లో ఎన్నింటిలో అప‌రాధాల‌ను చ‌ట్టం ముందు ఉంచింది, సీబీఐ సక్సెస్ రేటు ఎంత‌? త‌దిత‌ర అంశాల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను త‌మ ముందు ఉంచాల‌ని... సుప్రీం కోర్టు త‌న ఆదేశాల్లో పేర్కొంది.

ఇప్ప‌టికే సీబీఐపై రాజ‌కీయ విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు సీబీఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ అంటూ కొన్ని పార్టీల వాళ్లు విమ‌ర్శించే వాళ్లు. ఇక బీజేపీ అధికారంలోకి వ‌చ్చాకా కూడా సీబీఐని త‌మ రాష్ట్రంలోకి రానివ్వ‌మంటూ గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు, ఆ త‌ర్వాత మ‌మ‌తా బెన‌ర్జీ లాంటి వాళ్లు... ర‌చ్చ‌ర‌చ్చ చేశారు. ఇలా సీబీఐ రాజ‌కీయ వివాదాల్లో కూడా నానుతూ ఉంటుంది. మ‌రి ఇప్పుడు సీబీఐ స‌క్సెస్ రేటు గురించి సుప్రీం కోర్టే వివ‌ర‌ణ కోర‌డం ఆస‌క్తిదాయ‌కంగా మారింది. ఆరు వారాల్లో సీబీఐ ఇచ్చే స‌మాచారం ఆ సంస్థ స‌త్తాకు నిద‌ర్శ‌నంగా నిలిచే అవ‌కాశం ఉంది.