డబ్బున్నోళ్ల కోసం ప్రైవేట్ జైళ్లు.. ఇక సుఖపడండి!

Sat Oct 01 2022 05:00:02 GMT+0530 (India Standard Time)

supreme court plans on Luxery jails

దేశంలో జైళ్లు అంటే.. నరకానికి నకళ్లు. అందుకే వేల కోట్లు ఎగ్గొట్టిన వారంతా విదేశాలకు పారిపోతున్నారు. దేశంలో కేసు తేలకుండా అనుమానంతో అరెస్ట్ అయిన రిమాండ్ ఖైదీలే వేలల్లో ఉంటారు. వారిపై విచారణ జరగ్గా జైల్లోనే మగ్గిపోతూ చనిపోయిన వారు ఉన్నారు. ఇక సాధారణ కేసుల్లో ఇరుక్కొని జైలుకు వెళ్లినా కూడా అక్కడ మౌళిక సదుపాయాలు లేక అష్టకష్టాలు పడేవారు ఎందరో.. జైల్లో అసలు బాత్రూంలు ఉండవు. దోమలు.. సౌకర్యాలు లేక ఖైదీలు నరకం అంటే ఏంటో అనుభవిస్తారు.జైళ్లలో పరిస్థితులపై ఎన్నో సినిమాల్లో చూపించారు. ఇంకా లైవ్ లో దారుణంగా ఉంటుంది. అందుకే ఒక కేసు విచారణ సందర్భంగా జైళ్ల పరిస్థితిని తెలుసుకున్న సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ప్రైవేటు జైళ్లు పెట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ప్రైవేటు జైళ్ల నిర్మాణ ప్రస్తావన తెచ్చిందో వెంటనే ఈ విషయంపై జోరుగా చర్చ సాగుతోంది.

కేసు విచారణ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ మన జైళ్లలో రద్దీ బాగా పెరిగిపోయిందని అభిప్రాయపడ్డారు. మన జైళ్లల్లో అత్యధికం నరకంగా ఉంటాయని అన్నారు. ఖైదీల రద్దీ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశంలో కూడా ప్రైవేటు జైళ్లు నిర్మించాలని కోర్టు అభిప్రాయపడింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కార్పొరేట్ సంస్థలే జైళ్ల నిర్మాణానికి పూనుకోవాలని కూడా సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది. నిజానికి ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన ప్రైవేటు జైళ్ల నిర్మాణం చాలా మంచి ఆలోచనే. డబ్బులుండి ఎంతైనా ఖర్చు పెట్టుకోగలిగిన వారు ప్రైవేటు జైళ్లల్లో ఉంటారు. ఇప్పుడున్న జైళ్లన్నీ దశాబ్ధాల క్రితం కట్టినవే. అందుకనే వాటిలో సౌకర్యాలన్నివే ఉండవు.

మన దేశంలో కేసుల విచారణ సంవత్సరాల కొద్దీ జరుగుతోంది. ఖైదీ మరణించినా తేలని కేసులు ఎన్నో.. రిమాండ్ ఖైదీలుగా లక్షలమంది జైళ్లలోనే మగ్గి చస్తున్నారు. జైళ్ల నుంచి విడుదలయ్యే వారికన్నా లోపలకు వెళ్లే వారిసంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. ఇందుకనే ఏ జైలులో చూసినా ఖైదీలు దాని కెపాసిటీకి మించే ఉంటున్నాయి. దీంతో జైళ్లో కనీస సౌకర్యాలు సరిగా ఉండడం లేవు. జైలు గదులు బాత్ రూంలు భోజనానికి వంటకు అన్నింటికి ఇబ్బందిగానే ఉంటోంది.  

ఇదే ప్రైవేట్ జైలు అయితే నిర్మాణం నిర్వహణ అంతా కార్పొరేట్ సంస్థలే చూసుకుంటాయి. అత్యాధునిక సౌకర్యాలుంటాయనడంలో సందేహం లేదు.  డబ్బులిచ్చి జైళ్లలో సౌకర్యాలు పొందాలని అంటే చాలా మంది ఈ ప్రైవేట్ జైళ్లకే మొగ్గుచూపుతారు. తమ శిక్షాకాలాన్ని ఆనందంగా గడిపేందుకు అవకాశం ఉంటుంది. ఐరోపా దేశాల్లో ప్రైవేట్ జైళ్లు నేరస్థుల పాలిట ఒక లగ్జరీ హోటల్స్ గా మారాయి. ఇది ఇండియాలో అమలవుతుందో లేదో చూడాలి.  

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.