Begin typing your search above and press return to search.
కోవిడ్ పరిహారం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
By: Tupaki Desk | 11 April 2022 5:30 PM GMTకోవిడ్ 19తో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఇచ్చే ఆర్ధిక సహాయంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరిహారం కోసం దరఖాస్తు చేసుకునేందుకు నిర్ణీత గడువు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 20వ తేదీకి ముందు చోటుచేసుకున్న కోవిడ్ మరణాలకు సంబంధించి 60 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. భవిష్యత్తులో చోటుచేసుకునే కోవిడ్ మరణాలకు మాత్రం బాధిత కుటుంబాలకు 90 రోజుల్లోగా దరఖాస్తుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలు పరిహారం పొందే విషయంపై మార్చి 24వ తేదీన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చినట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది. కోవిడ్ పరిహారం కోసం బాధిత కుటుంబాలకు నెలరోజుల గడువు ఇవ్వనున్నట్లు కేంద్రం చేసిన ప్రతిపాదన సరిపోదని సుప్రీంకోర్టు గత నెలలో అభిప్రాయపడింది. కుటుంబ సభ్యులను కోల్పోయిన విషాదం నుంచి బాధితులు కోలుకొని పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవడానికి సమయం పడుతుందని పేర్కొంది.
మార్చి 20వ తేదీకి ముందు జరిగిన కోవిడ్ మరణాలకు 60 రోజుల గడువు.. భవిష్యత్తులో సంభవించే వాటికి 90 రోజుల గడువు ఇవ్వాలని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బి.వి నాగరత్నం ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది.
మరోవైపు పరిహారం కోసం వచ్చే నకిలీ అభ్యర్థనలను గుర్తించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కసరత్తును చేపట్టాలని పేర్కొంది. కరోనా మృతుల కుటుంబాలు పరిహారం కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు నిర్ధేశించాల్సిన అవసరం ఉందని సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు సూచించారు. స్పష్టమైన గడువు లేకుండా పరిహార ప్రక్రియను నిరంతరం కొనసాగించడం సరికాదని అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు కోవిడ్ బాధితుల దరఖాస్తుకు 60 రోజుల గడువు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.