Begin typing your search above and press return to search.
అయోధ్య రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..!
By: Tupaki Desk | 12 Dec 2019 11:51 AM GMTదేశంలో అత్యంత కీలకమైన అయోధ్య లోని వివాదాస్పద స్థలం పై గత నెల లో తుది తీర్పుని వెలువరించిన విషయం తెలిసందే. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణానికి వీలుగా రామ్ లల్లాకు కేటాయించాలని సుప్రీం తీర్పు ఇచ్చింది. ఆ తరువాత అయోధ్య తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన అన్ని రివ్యూ పిటిషన్లను తాజాగా సుప్రీం కోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు - హిందూ మహాసభ - నిర్మోహి అఖాడాతో పాటు మరో 40 మంది రివ్యూ పిటిషన్ వేశారు. ఐతే ఆ పిటిషన్లను తిరస్కరించిన సుప్రీం కోర్టు.. నవంబరు 9న ఇచ్చిన తీర్పే ఫైనల్ అని తేల్చిచెప్పింది.
మసీదు నిర్మాణం కోసం ఐదెకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయోధ్య తీర్పును సమీక్షించాలంటూ.. డిసెంబర్ 2న సుప్రీంలో తొలి రివ్యూ పిటిషన్ దాఖలైంది. జమయత్ ఉలామా ఇ హింద్ ఉత్తరప్రదేశ్ విభాగం అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 6న మరో ఆరు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. డిసెంబర్ 9న రెండు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి.