Begin typing your search above and press return to search.

శ్రీ‌వారి న‌గ‌ల పిటిష‌న్..స్వామికి చుక్కెదురు!

By:  Tupaki Desk   |   17 Sep 2018 1:20 PM GMT
శ్రీ‌వారి న‌గ‌ల పిటిష‌న్..స్వామికి చుక్కెదురు!
X
టీటీడీ పాల‌క‌మండలికి - ఆల‌య మాజీ ప్ర‌ధాన అర్చ‌కుడు ర‌మ‌ణ దీక్షితులుకు మ‌ధ్య కొంత‌కాలంగా మాట‌ల యుద్ధం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. టీటీడీ బోర్డులో జ‌రుగుతోన్న అవ‌క‌త‌వ‌క‌ల‌పై - ఆగ‌మ శాస్త్రాల‌కు విరుద్ధంగా జ‌రుగుతోన్న ప‌నుల‌పై తాను నోరు మెదిపినందుకే ప్ర‌భుత్వం త‌న‌పై క‌క్ష్య తీర్చుకుంటోంద‌ని ర‌మ‌ణ దీక్షితులు ఆరోపించారు. శ్రీ‌వారి పోటులోని నేల‌మాళిగ‌లో ఉన్న నిధుల కోస‌మే ఏపీ సీఎం చంద్ర‌బాబు ...త‌న అనుయాయుల‌తో ఆ త‌వ్వ‌కాలు జ‌రిపార‌ని ర‌మ‌ణ దీక్షితులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో వెంక‌న్న నగలు మాయ‌మ‌య్యాయ‌న్న ఆరోప‌ణ‌లు - శ్రీ‌వారి పోటులో త‌వ్వ‌కాల క‌ల‌క‌లం....పాలకమండలి నిర్ణయాలు....భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయ‌ని బీజేపీ ఎంపీ సుబ్ర‌మ‌ణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ర‌మ‌ణ దీక్షితులును తొల‌గించ‌డం - శ్రీ‌వారి న‌గ‌లు మాయ‌మ‌వ‌డంపై విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరారు. ఆ పిటిష‌న్ నేడు విచార‌ణ‌కు వ‌చ్చింది.

ఈ క్ర‌మంలో స్వామికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఆ పిటిష‌న్ ను సుప్రీం కోర్టు తోసి పుచ్చింది. ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో ఆ పిటిష‌న్ దాఖ‌లు చేయాల‌ని స్వామికి సుప్రీం సూచించింది. సుప్రీం నిర్ణ‌యాన్ని స్వామి స్వాగ‌తిస్తూ ట్వీట్ చేశారు. ఆ వ్య‌వ‌హారం విచార‌ణ‌లో తొలి అడుగు ప‌డింద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కోర్టు ప్రొసీడింగ్స్ ప్ర‌కారం ఏపీ హైకోర్టులో ఆ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు. ర‌మ‌ణ దీక్షితులు - న‌గ‌ల మాయం - స్వామివారి నిధుల‌లో అవ‌క‌త‌వ‌క‌ల వ్య‌వ‌హారంలో సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని సుప్రీం కోర్టులో స్వామి పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

అంతేకాకుండా - ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి...ఏపీ ప్ర‌భుత్వం క‌బంధ హ‌స్తాల్లో నుంచి విముక్తి క‌ల్పించాల‌ని కోరారు. అంత‌కుముందు, వెంక‌న్న నగలు మాయ‌మ‌య్యాయ‌న్న ఆరోప‌ణ‌లు, శ్రీ‌వారిపోటులో త‌వ్వ‌కాల క‌ల‌క‌లం....పాలకమండలి నిర్ణయాలు....ఇవ‌న్నీ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయ‌ని ఉమ్మ‌డి హైకోర్టులో ఓ పిటిషన్ దాఖ‌లైన సంగ‌తి తెలిసిందే. శ్రీ‌వారి న‌గ‌ల గోల్ మాల్ పై భక్తుల్లో అనుమానాలున్నాయని - అందుకే శ్రీవారి ఆభరణాలు - ఆస్తుల వివరాలను ఆన్‌ లైన్ లో పెట్టాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే.