Begin typing your search above and press return to search.

అమ్మ మ‌ర‌ణంపై ద‌ర్యాప్తు..సుప్రీం కీల‌క ఆర్డ‌ర్‌

By:  Tupaki Desk   |   26 April 2019 1:54 PM GMT
అమ్మ మ‌ర‌ణంపై ద‌ర్యాప్తు..సుప్రీం కీల‌క ఆర్డ‌ర్‌
X
అన్నాడీఎంకే అధినేత్రి - త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణంపై నెల‌కొన్న ఉత్కంఠ‌కు ద‌ర్యాప్తు క‌మిష‌న్ తెర‌దించుతుంద‌ని భావించిన‌ప్ప‌టికీ... విచార‌ణ ప‌ర్వంలోనే బ్రేకులు ప‌డుతున్నాయి. ద‌ర్యాప్తు క‌మిష‌న్ ప్ర‌క్రియ విష‌యంలో సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు ఇచ్చింది. అపోలో ఆస్ప‌త్రికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో అమ్మ మ‌ర‌ణం మ‌రో మ‌లుపు తిరిగిన‌ట్ల‌యింది.

2016లో అపోలో హాస్ప‌ట‌ల్‌ లో 75 రోజులు చికిత్స పొందిన త‌ర్వాత జ‌య మ‌ర‌ణించారు. అయితే, అమ్మ మ‌ర‌ణం విష‌యంలో సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. దీంతో, ప్ర‌భుత్వం అర్ముగ‌స్వామి క‌మిటీని నియ‌మించింది. ఈ క‌మిటీ తన ద‌ర్యాప్తుల ప‌ర్వంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఆమె మరణంలో తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి జే రాధాకృష్ణన్ - అపోలో ఆసుపత్రి - అప్పటి చీఫ్ సెక్రటరీ రామమోహన్‌ రావు కుట్ర పన్నారని కమిటీ ఆరోపించడం గమనార్హం. అప్పటి ప్రధాన కార్యదర్శి కావాలని తప్పుడు సాక్ష్యం ఇచ్చారనీ కమిటీ చెప్పింది. కమిషన్ తరఫున మద్రాస్ హైకోర్టులో అడ్వొకేట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ ఆరోపణలను అపోలో ఆసుపత్రి - హెల్త్ సెక్రటరీ ఖండించగా.. మాజీ సీఎస్ రామ్ మోహన్‌ రావ్ మాత్రం ఈ పిటిషన్ గురించి తెలియదని అన్నారు. మ‌రోవైపు ఆ కేసులో అపోలో డాక్ట‌ర్ల‌ను ఎంక్వైరీ క‌మిష‌న్ విచారిస్తున్న‌ది. దానిలో భాగంగానే డాక్ట‌ర్లకు ఆ క‌మిష‌న్ స‌మ‌న్లు జారీ చేసింది. హాస్ప‌ట‌ల్ రికార్డులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది.

అయితే, అపోలో హాస్ప‌ట‌ల్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. ద‌ర్యాప్తును నిలిపివేయాల‌ని కోర్టును కోరింది. చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గ‌గోయ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం అపోల్ వేసిన పిటీష‌న్‌ ను అనుకూలంగా తీర్పునిచ్చింది. అపోలో అభ్య‌ర్థ‌న‌ను మ‌ద్రాసు హైకోర్టు తిర‌స్క‌రించ‌డంతో.. ఆ హాస్ప‌ట‌ల్ సుప్రీంకు వెళ్లాల్సి వ‌చ్చింది. జ‌య మ‌ర‌ణంపై విచార‌ణ చేప‌డుతున్న క‌మిష‌న్‌.. ఎంజీఆర్‌ కు ఇచ్చిన చికిత్స వివ‌రాల‌ను కూడా కోరుతున్నద‌ని అపోలో కోర్టుకు విన్న‌వించింది. వాద‌న‌లు విన్న అనంత‌రం సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువ‌రించింది.