Begin typing your search above and press return to search.
మీది ట్రిలియన్ డాలర్ల సంస్థే .. కానీ గోప్యతే ముఖ్యం : వాట్సాప్ కు సుప్రీంకోర్టు నోటీసులు !
By: Tupaki Desk | 15 Feb 2021 11:30 AM GMTప్రముఖ సోషల్ మీడియా సంస్థ అయిన ఫేస్ బుక్, దానికి చెందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇండియాలో ఇటీవల అవి ప్రవేశపెట్టిన నూతన గోప్యతా విధానంపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో సుప్రీం ఆదేశించింది. నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆ సంస్థకు చురకలు అంటించింది. మీది లక్షల కోట్ల డాలర్ల కంపెనీ కావచ్చు. కానీ ప్రజల వ్యక్తిగత గోప్యత అనేది అంతకంటేముఖ్యం అని స్పష్టం చేసింది.
దానిని రక్షించే బాధ్యత మా మీద ఉంది అంటూ చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మీ కొత్త ప్రైవసీ పాలసీ వల్ల తమ గోప్యతకు భంగం వాటిల్లుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాము ఎవరో ఒకరికి పంపిన సందేశాలను వాట్సాప్, ఫేస్ బుక్ తో పంచుకోవడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రైవసీని కాపాడటం కోసం మేం తప్పక జోక్యం చేసుకుంటామని తెలిపింది. ఇందుకు సంబంధించి కేంద్రంతో పాటు, వాట్సాప్, ఫేస్ బుక్ లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
గోప్యత లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించింది. ఎవరికైనా మెసేజ్ పంపితే అది ఫేస్ బుక్ కు అందుబాటులో ఉంటోందని ప్రజలు అనుకుంటున్నారని చెప్పింది. విచారణ సందర్భంగా ఫేస్ బుక్, వాట్సాప్ తరపున కపిల్ సిబాల్ వాదిస్తూ... నూతన గోప్యతా విధానం వల్ల యూజర్ల సమాచారం బయటకు వెళ్లదని అన్నారు. ప్రైవసీపై యూరప్ లో ఒక ప్రత్యేక చట్టం ఉందని, ఇండియా కూడా అలాంటి చట్టాలనే తీసుకొస్తే, దాన్ని అనుసరించడం జరుగుతుందని చెప్పారు. ఇక వాట్సాప్, ఫేస్ బుక్ తరఫున కపిల్ సిబాల్, అరవింద్ దాతర్ తమ వాదనలు వినిపించారు. ప్రైవసీకి భంగం కలుగుతుందనే ఆరోపణలు వాస్తవం కాదని తెలిపారు.