Begin typing your search above and press return to search.
మారటోరియం ట్విస్ట్: ఆర్బీఐకి సుప్రీం నోటీసులు
By: Tupaki Desk | 16 May 2020 4:30 AM GMTకరోనా--లాక్ డౌన్ తో కోట్ల మంది ఉపాధి పోయి అంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పటికే 3 దశలు పూర్తయ్యాయి. రెండు నెలలకు లాక్ డౌన్ చేరువ అవుతోంది. ఇప్పటికీ సడలింపులతోనే లాక్ డౌన్ 4.0ను అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది.
అయితే కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి వర్గాలు రెండు నెలలుగా జీతాలు లేవు. కుటుంబ పోషణే భారంగా ఉంది. రుణాల చెల్లింపులు కనాకష్టంగా మారాయి. దీంతో రుణాల చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటన చేసింది.
తాజాగా ఈ మారటోరియంపై సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. మారటోరియం పై స్పష్టత ఇవ్వాలని కేంద్రం, ఆర్బీఐలకు నోటీసులు జారీ చేసింది. వెంటనే అభిప్రాయం తెలుపాలని కేంద్రం, ఆర్బీఐకి సూచించింది.
ఆర్బీఐ అమలు చేస్తున్న మారటోరియం స్థిరాస్తి రంగానికి కూడా వర్తిస్తుందో లేదో వివరించాలని కోరుతూ భారత స్థిరాస్తి రంగ అభివృద్ధి సంస్థ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం.. స్పష్టతనివ్వాలని ఆదేశించింది. మరి.. ఆర్బీఐ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.