Begin typing your search above and press return to search.

జడ్జిలు.. లాయర్ల డ్రెస్సులు మార్చేసిన మాయదారి రోగం

By:  Tupaki Desk   |   14 May 2020 5:45 AM GMT
జడ్జిలు.. లాయర్ల డ్రెస్సులు మార్చేసిన మాయదారి రోగం
X
జడ్జి.. లాయర్ అన్నంతనే మనసులో మెదిలేది.. నల్లటి కోటు కానీ.. పొడుగాటి నల్ల గౌన్ కానీ వేసుకొని కేసుల్ని వాదించటం.. లాయర్ల వాదనను న్యాయమూర్తి క్షుణ్ణంగా వినటం లాంటివి చప్పున గుర్తుకు వస్తాయి. ఇప్పటివరకూ ఇదంతా ఓకే కానీ.. ఇప్పటి నుంచి ఈ సీన్ మొత్తంగా మారనుంది. మాయదారి రోగం ప్రపంచాన్ని ఆగమాగం చేస్తున్న వేళ.. జడ్జిలు.. లాయర్లు వేసుకునే నల్ల కోట్లు తాత్కాలికంగా కనిపించే అవకాశం లేదు.

దీనికి సంబంధించిన ఆసక్తికర నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. జడ్జిలు.. లాయర్లు ఇకపై నల్లకోటు.. గౌన్ ధరించకూడదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకిలా? అంటే.. మాయదారి రోగం వ్యాప్తి చెందేందుకు గౌన్లు.. కోట్లు కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించటంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఇప్పుడు ధరిస్తున్న నల్లకోటు.. భారీ గౌన్ స్థానే.. పురుషులు తెల్లచొక్కా వేసుకొని తమ వాదనల్ని వినిపిస్తారని.. జడ్జిలు కూడా అదే పద్దతిని అనుసరిస్తారని చెబుతున్నారు. ఇక.. మహిళా జడ్జిలు.. లాయర్లు తెలుపు సల్వార్ కమీజ్ కానీ.. తెలుపు చీరతో తెల్లటి టైని ధరించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం న్యాయవివాదాల విచారణ మొత్తం ఆన్ లైన్ లో సాగుతోంది. ఈ విధానంలో డ్రెస్ కోడ్ మీద సుప్రీం కోర్టు తాజాగా క్లారిటీ ఇచ్చింది. తర్వాతి కాలంలో తామిచ్చే ఉత్తర్వుల వరకూ ఈ కొత్త విధానం అమలులో ఉంటుందని చెబుతున్నారు.