Begin typing your search above and press return to search.
దోషిగా తేలిన ప్రజాప్రతినిధి ఓటు చెల్లుబాటు..సుప్రీం కీలక తీర్పు!
By: Tupaki Desk | 19 Dec 2020 6:00 AM GMTచట్టసభలకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గౌరవం ఉంది. అటువంటి చట్టసభల్లో నేరచరితుల అంశంపై దేశంలో తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో సుప్రీం కోర్టు మరో కీలక తీర్పును శుక్రవారం వెలువరించింది. నేరం రుజువై దోషిగా తేలిన ప్రజాప్రతినిధి ఓటు చెల్లుబాటుపై తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు , దోషిగా తేల్చిన సందర్భంలో తీర్పు వెలువడే సమయం ముందు వరకూ ఆ వ్యక్తి ఓటు చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది.
తీర్పు వెలువరించడానికి ముందే ఆ వ్యక్తి ఓటు చెల్లుబాటు కాదని చెప్పలేమని వెల్లడించింది . ఒకవేళ అలా చేస్తే ఆ ప్రజాప్రతినిధి హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది.మార్చి 23,2018న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యే అమిత్ కుమార్ మహతో ఉదయం 9.15 నిమిషాలకు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ధీరజ్ ప్రసాద్ సాహూకి ఓటేశారు. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఓ కేసులో న్యాయస్థానం ఆయన్ను దోషిగా తేల్చింది.
అయితే , అప్పటికే అమిత్ ఓటువేయడంతో లెక్కింపులో దీనిని పరిగణనలోకి తీసుకున్నారు. తత్ఫలితంగా బీజేపీ నుంచి పోటీచేసిన రాజ్యసభ అభ్యర్థి ప్రదీప్ కుమార్ సోంతాలియా ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి ధీరజ్ ప్రసాద్ సాహూ విజయం సాధించడంతో దీన్ని సవాల్ చేస్తూ ప్రదీప్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. అమిత్ కుమార్ ఓటు చెల్లబాటుకాదని, ధీరజ్ ప్రసాద్ సాహును ఎన్నిక చెల్లదని వాదించారు. ఆయన ఎన్నికల పిటిషన్ ను ఝార్ఖండ్ హైకోర్టు ఈ ఏడాది జనవరి 17న కొట్టేసింది. దీంతో ప్రదీప్ కుమార్ సుప్రీంకోర్టు తలుపుతట్టడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ ఎస్.ఎ.బోపన్న, వి.రామసుబ్రమణియన్ ల ధర్మాసనం విచారణ చేపట్టింది. తాజాగా తీర్పుని వెల్లడించారు .