Begin typing your search above and press return to search.
మోడీదే జయం.. 14 పార్టీలకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ!!
By: Tupaki Desk | 5 April 2023 10:27 PM GMTప్రధాని నరేంద్ర మోడీనే మరోసారి విజయం దక్కించుకున్నారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ, సీడబ్ల్యుసీ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తోందని.. దీనిపై విచారించి తగు విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ.. కాంగ్రెస్ సహా 14 ప్రతిపక్ష పార్టీలు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఏదైనా ఒక కేసుకు సంబంధించిన వాస్తవాల్ని పరిశీలించకుండా.. ఇలా అన్నింటికీ కలిపి మార్గదర్శకాలు ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది.
దేశంలో పలు పార్టీలకు చెందిన నేతలను సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను అడ్డు పెట్టుకుని కేంద్రం వేధిస్తోందని ప్రతిపక్ష పార్టీలు.. కొన్నాళ్లుగా ఆరోపిస్తున్నాయి. ఇదే విషయంపై పార్లమెంటులో నూ.. ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. అయితే.. మోడీ మాత్రం ఈడీ దెబ్బతో.. ప్రతిపక్షాలు ఏకమయ్యాయని.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టు ను ఆశ్రయించాయి.
ఈ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలాతో కూడిన ధర్మాసనం విచారణకు కూడా స్వీకరించలేదు. అంతేకాదు, ఏదైనా ఒక కేసుకు సంబంధించిన సరైన ఆధారాలు లేకుండా ఇలా అన్నింటికీ కలిపి మార్గదర్శకాలు రూపొందించడం సాధ్యం కాదని.. ఇలా చేస్తే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించలేమని తేల్చి చెప్పింది.
సాధారణ పౌరులు, రాజకీయ నాయకులు సమానమని తాము అంగీకరించిన తర్వాత.. వారిని అరెస్ట్ చేయకూడదని తాము ఎలా చెబుతామని ప్రశ్నించింది. క్రిమినల్ కేసు లేదా కేసులు ఉన్నప్పుడు.. మళ్లీ తమ వద్దకు రావాలని పిటిషనర్లకు సూచించింది. 95 శాతం కేసులు ప్రతిపక్ష పార్టీల పైనే ఉన్నాయని.. అరెస్ట్‌కు ముందు, తర్వాత మార్గదర్శకాలను కోరుతున్నామని ప్రతిపక్ష పార్టీలు పిటిషన్‌లో కోరాయి. అయితే.. సుప్రీం కోర్టు మాత్రం విచారణకు స్వీకరించకపోవడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.