Begin typing your search above and press return to search.
సుప్రీంలో మరో కలకలం..ఇద్దరు జడ్జీల తాజా లేఖ
By: Tupaki Desk | 25 April 2018 1:17 PM GMTదేశ సర్వోన్నత న్యాయస్థానంలో మరో కలకలం చోటుచేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి మరోమారు ఇద్దరు జడ్జీలు లేఖ రాశారు. సుప్రీంకోర్టును చుట్టుముడుతున్న సమస్యల పరిష్కారం కోసం వెంటనే ఫుల్ కోర్ట్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ ఇద్దరు జడ్జీలు సీజేఐ దీపక్ మిశ్రాకు లేఖ రాశారు. జస్టిస్ రంజన్ గొగొయ్ - జస్టిస్ ఎంబీ లోకూర్ రెండు వాక్యాల ఈ లేఖపై సంతకాలు చేశారు. అత్యున్నత న్యాయస్థానాన్ని వేధిస్తున్న సంస్థాగత సమస్యలపై చర్చించేందుకే ఫుల్ కోర్టును సమావేశపరచాల్సిందిగా వాళ్లు కోరారు. ఇదే అంశాన్ని మార్చి 21న జస్టిస్ చలమేశ్వర్ - ఏప్రిల్ 9న జస్టిస్ జోసెఫ్ కురియన్ కూడా లేవనెత్తారు.
సాధారణంగా ప్రజలకు సంబంధించి ఏదైనా అతి ముఖ్యమైన అంశం తెరపైకి వచ్చినపుడు చీఫ్ జస్టిస్ ఫుల్ కోర్టును సమావేశపరుస్తారు. ఫుల్ కోర్ట్ అంటే అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న అందరు జడ్జీలతో కూడిన సమావేశం. ఏప్రిల్ 22న రాసిన ఈ లేఖపై సీజేపీ ఇప్పటివరకు స్పందించలేదు. సీజేఐ దీపక్ మిశ్రా అక్టోబర్ 2న రిటైర్ కానున్నారు. ఆయన తర్వాత జస్టిస్ గొగొయే సీజేఐ కానున్నారు.
ఇదిలాఉండగా...న్యాయవ్యవస్థలో ప్రభుత్వ జోక్యం క్రమంగా పెరుగుతున్న తీరుపై జాస్తి చలమేశ్వర్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ జోక్యంతో న్యాయవ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రెండు వ్యవస్థల మధ్య సఖ్యత పెరిగితే భవిష్యత్ లో ప్రజాస్వామ్యానికి మరణశిక్షగా పరిణమిస్తుందన్నారు. వెంటనే దీనిపై సుప్రీంకోర్టులోని న్యాయమూర్తులందరితో ఫుల్‌కోర్టును ఏర్పాటు చేసి విస్తృతంగా చర్చించాలని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) దీపక్‌మిశ్రాకు లేఖ రాశారు. జస్టిస్ చలమేశ్వర్ తన ఆరు పేజీల లేఖ ప్రతులను సీజేఐతోపాటు సుప్రీంకోర్టులోని మిగతా 22 మంది జడ్జీలకూ పంపారు. జడ్జీల నియామకంలో కేంద్రం, న్యాయశాఖ జోక్యాన్ని ఆయన తన లేఖలో ప్రశ్నించారు. జడ్జీల పదోన్నతులపై కొలీజియం నిర్ణయం తీసుకున్నా, ప్రభుత్వం తమకు అనుకూలంగా లేనివారి పేర్లను కావాలనే పక్కన పెడుతున్నదని, సాకుతో పదోన్నతులను అడ్డగించేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు.