Begin typing your search above and press return to search.
పెద్దాయన మెట్టు దిగితేనే గొడవ అణిగేది!
By: Tupaki Desk | 15 Jan 2018 8:30 AM GMTసుప్రం కోర్టులో రేగి గొడవ ఇంకా సద్దుమణగడం లేదు. దీనికి అనుబంధ వివాదాలు రేగుతూనే ఉన్నాయి. మరోవైపు ఈ వివాదం మరింత రచ్చకెక్కకుండా.. దీన్ని ఇక్కడితో ముగించడానికి రెండో వైపు నుంచి ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. ఈ వివాదాన్ని సుప్రీంకోర్టు పరిధిలోనే పరిష్కరించుకోవాలి.. అనే చిన్న స్టేట్ మెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తమకు సంబంధం లేదన్నట్టుగా చేతులు దులిపేసుకుంది. అధికారికంగా వారినుంచి ఎలాంటి జోక్యం కనిపించడగం లేదు. ఇప్పుడు బార్ కౌన్సిల్ నాయకులే కీలక మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తున్నారు. వారే ఇటు తిరుగుబాటు చేసిన న్యాయమూర్తులను, అటు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాను కూడా కలిసి మంతనాలు సాగించారు. మొత్తానికి పరిణామాల్ని గమనిస్తోంటే.. చీఫ్ జస్టిస్ ఒక మెట్టు దిగి రాకుండా.. ఈ వివాదం సమసిపోయే ఆస్కారం లేదని అర్థమవుతోంది. అందుకు ఆయన సిద్ధంగానే ఉన్న వాతావరణం కూడా కనిపిస్తోంది.
రెండు నెలల కిందట జస్టిస్ చలమేశ్వర్ తదితరులు , చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ ద్వారా ఎలాంటి అభ్యంతరాలను వ్యక్తం చేశారో.. ఏ అంశాలపై దృష్టి పెట్టాలని కోరారో ప్రెస్ మీట్ లో చెప్పారు. జస్టిస్ లోయా అనుమానాస్పద మరణం కేసును విచారిస్తున్న అరుణ్ మిశ్ర కు అప్పగించడం సరికాదనే ఆరోపణ కూడా అందులో ఉంది. రోస్టర్ విధానం గురించి ప్రస్తావన ఉంది. ఈ అంశాల్లో చీఫ్ జస్టిస్ ఒక మెట్టు దిగివస్తే తప్ప ప్రతిష్టంభన తొలగే అవకాశం లేదు.
అయితే సీజే మాత్రం అంతా సర్దుకుంటుంది అని భరోసా ఇస్తున్నారు. దీనిని బట్టి ఆయన తిరుగుబాటు న్యాయమూర్తుల డిమాండ్లను గౌరవించడానికే నిర్ణయించుకున్నట్లుగా అర్థమవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సోమవారం సుప్రీం కోర్టు ఫుల్ బెంచ్ న్యాయమూర్తుల సమావేశంలో ఈ వ్యవహారాన్ని కూలంకషంగా చర్చించే అవకాశం కూడా ఉంది. మొత్తానికి న్యాయవ్యవస్థ పనితీరు మీదే అనేక రకాల సందేహాలకు కారణం అయిన ఈ ఆరోపణల వ్యవహారం ఒక కొలిక్కి రావడం అంటూ జరగవచ్చు గానీ.. న్యాయవ్యవస్థ స్వేచ్ఛ, పరిపాలన-పనితీరులో పారదర్శకత, స్వచ్ఛత విషయంలో ప్రజల్లో ఈ ఎపిసోడ్ పుణ్యమా అని రేగిన అనుమానాలు మాత్రం అలాగే మిగిలిపోయే ప్రమాదం ఉంది.