Begin typing your search above and press return to search.
మేధావుల బాధ్యత అదే.. సుప్రీం కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు
By: Tupaki Desk | 28 Aug 2021 11:30 AM GMTప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి.. మేధావులు ఎప్పటికప్పుడు ప్రశ్నించాల్సిందేనని.. ఈ విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని.. సుప్రీం కోర్టు న్యాయమూర్తి.. జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ప్రభుత్వ లోపాలను, అబద్దాలను ఎత్తిచూపాల్సిన బాధ్యత మేధావులకు ఉందని వ్యాఖ్యానిం చారు. ఈ మేరకు ఈ రోజు ఉదయం జరిగిన జస్టిస్ ఎంసీ చాగ్లా స్మారకోపన్యాసంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘స్పీకింగ్ ట్రూత్ టు పవర్.. సిటిజన్ అండ్ ది లా’ అనే అంశంపై మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించడం, అబద్ధాలు, తప్పుడు కథనాలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్త వహించడం చాలా ముఖ్యమని నొక్కిచెప్పారు.
ఆధార పడొద్దు!
ప్రస్తుత పరిస్థితిలో సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, వైద్య విభాగాలకు సంబంధించిన అంశా లను సేకరించేందుకు, లేదా నిజాలు చెప్పేందుకు, తెలుసుకునేందుకు.. ప్రభుత్వంపై అతిగా ఆధార పడకూడదని ఆయన హెచ్చరించారు. దీనికి ఆయన ఉదాహరణ వివరిస్తూ.. కోవిడ్-19 డేటా తారుమారే నని వ్యాఖ్యానించారు. ‘నిజం కోసం కేవలం ప్రభుత్వంపై మాత్రమే ఆధారపడలేరు.. నిరంకుశ ప్రభుత్వా లు అధికారాన్ని ఏకీకృతం చేయడానికి అబద్ధాలపై నిరంతరం ఆధారపడుతుంటాయి. పలు దేశాలలో కోవిడ్-19 డేటాను తారుమారు చేసే ధోరణి పెరుగుతున్న వాస్తవం మనం చూస్తున్నాం’ అన్నారు
నకిలీ వార్తల ప్రచారం తగ్గాలి!
నకిలీ వార్తల ప్రచారం పెరుగుతోందని జస్టిస్ చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని గుర్తించిందన్నారు. సంచలన వార్తలకు ఆకర్షితుల య్యే ధోరణిని కలిగి ఉండటాన్ని ‘ఇన్ఫోడెమిక్’గా పిలుస్తారని చెప్పారు. అవి తరచుగా అసత్యాలపై ఆధారపడి ఉంటాయని జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ‘పోస్ట్-ట్రూత్’ ప్రపంచం గురించి కూడా జస్టిస్ చంద్రచూడ్ ప్రస్తావించారు. ఇందులో ‘మా సత్యం వర్సెస్ మీ నిజం` మధ్య పోటీ ఉంది. అంటే అవగాహనకు అనుగుణంగా లేని సత్యాన్ని విస్మరించే ధోరణి’ అని అన్నారు.
న్యాయమూర్తుల వరుస
గత కొన్ని రోజులుగా చూస్తే.. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు.. ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. ప్రభుత్వాల గురించే మాట్లాడుతున్న విషయం గమనార్హం. ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నుంచి సుప్రీం కోర్టు న్యాయమూర్తి.. జస్టిస్ లావు నాగేశ్వరరావు.. వరకు.. చాలా మంది న్యాయమూర్తులు.. ఎక్కడ ఏ సందర్భంలో మాట్లాడినా.. ప్రభుత్వాల తీరుపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తుండడం గమనార్హం. తాజాగా జస్టిస్ చంద్రచూడ్ కూడా ఇదే ధోరణిలో వ్యాఖ్యలు చేయడం.. ఇటు న్యాయ, అటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం కావడం గమనార్హం.