Begin typing your search above and press return to search.
జగన్ ను తొలగించాలన్న పిటీషన్లు కొట్టేసిన సుప్రీంకోర్టు
By: Tupaki Desk | 1 Dec 2020 11:54 AM GMTఓ సుప్రీం కోర్టు జడ్జిపై ఆరోపణలు చేసినందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ పిటీషన్లను కొట్టివేసింది.
ఓ సుప్రీం కోర్టు జడ్జితోపాటు మరికొందరు హైకోర్టు న్యాయమూర్తులపై జగన్ లేఖ రాయడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు పిటిషనర్లు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తాజాగా వీటిపై విచారించిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ పిటిషన్లను విచారించడానికి నిరాకరించింది. పిటిషన్లకు ఎటువంటి అర్హత లేదని ధర్మాసనం అభిప్రాయపడింది, ఎందుకంటే విచారణకు ఆదేశించాలా వద్దా అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ విచక్షణపై ఆధారపడి ఉందని పేర్కొంది.
"మరొక బెంచ్ ఇప్పటికే ఈ వివాదంపై కొన్ని సమస్యలను విచారించింది. ఏపీ హైకోర్టు మీడియాకు వ్యతిరేకంగా గాగ్ ఆర్డర్ ను ఎత్తివేసే మధ్యంతర ఉత్తర్వులను కూడా రద్దు చేసింది.అలాంటప్పుడు సీఎం జగన్ ను తొలగించాలన్న ఈ పిటిషన్లను ఎందుకు విచారించాలి. ఆ బెంచ్ ప్రతిదీ పరిశీలించనివ్వండి" అని జస్టిస్ కౌల్ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఓ సుప్రీం కోర్టు జడ్జిపై సీఎం జగన్ రాసిన లేఖ బహిర్గతం కావడంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టు బెంచ్ ను పిటీషనర్లు కోరారు. ఈ లేఖ ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి వెళ్లినందున ఎటువంటి విచారణ అవసరం లేదని అన్నారు.
"మీరు ఒక వార్తాపత్రికలో ఏదైనా చదివి, అన్ని రకాల ఊహాగానాలతో పిటిషన్ దాఖలు చేసినప్పుడే ఈ సమస్య" అని ధర్మాసనం అభిప్రాయపడింది.
అమరావతి భూ కుంభకోణం విషయంలో జగన్ ముందుకెళ్లకుండా చూడాలన్న మరో పిటిషన్‌లో కూడా కోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కోర్టు ఇప్పటికే గ్యాగ్ ఉత్తర్వును ఎత్తివేసినప్పుడు పిటిషన్ ఉద్దేశ్యాన్ని తెలుసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది.. సిట్టింగ్ న్యాయమూర్తిపై జగన్ ఎటువంటి వ్యాఖ్య చేయకుండా అడ్డుకోవాలన్న పిటిషన్ మాత్రం జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఇప్పటికే పెండింగ్‌లో ఉంది.