Begin typing your search above and press return to search.

డాక్టర్ రమేష్ కేసు : హైకోర్టు ఉత్వర్వులపై స్టే ఇచ్చిన సుప్రీం !

By:  Tupaki Desk   |   14 Sep 2020 10:10 AM GMT
డాక్టర్ రమేష్ కేసు :  హైకోర్టు ఉత్వర్వులపై స్టే ఇచ్చిన సుప్రీం !
X
ఏపీలో తీవ్ర సంచలనం రేపిన విజయవాడ స్వర్ణప్యాలెస్‌ అగ్నిప్రమాదం కేసులో సుప్రీం కోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. రమేష్ బాబుపై తదుపరి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. కేసు దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వానికి సుప్రీం అనుమతినిచ్చింది. డాక్టర్ రమేష్ బాబును అదుపులోకి తీసుకోకుండా విచారించాలని ఆదేశించింది. రమేష్ బాబు కూడా దర్యాప్తుకు సహకరించాలని సూచించింది.

గత నెలలో విజయవాడ స్వర్ణప్యాలెస్‌ కోవిడ్‌ కేర్ ‌లో చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటనలో పది మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. స్వర్ణప్యాలెస్‌ లో రమేష్‌ ఆస్పత్రి నిర్వహిస్తున్న కోవిడ్‌ కేర్ సెంటర్లో కనీస భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ పోలీసులు రమేష్‌ ఆస్పత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ రమేష్‌ బాబుతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. అయితే , తమపై ఏపీ పోలీసులు దాఖలు చేసిన కేసులను సవాల్‌ చేస్తూ రమేష్‌ ఆస్పత్రి యజమాని డాక్టర్‌ రమేష్‌ బాబు హైకోర్టు లో పిటిషన్ వేయగా .. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు , ఆ కేసులో పోలీసులు రూపొందించిన ప్రాథమిక దర్యాప్తు నివేదిక ఎఫ్‌ ఐ ఆర్ ‌పై స్టే విధించింది. అంతే కాకుండా రమేష్‌ ఆస్పత్రిపైనా, ఛైర్మన్‌ రమేష్‌ బాబుపైనా తదుపరి చర్యలను నిలిపివేసింది. అయితే , దీనిపై సుప్రీం మెట్లు ఎక్కగా .. ఈ కేసు విచారణకి నేడు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.