Begin typing your search above and press return to search.

హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

By:  Tupaki Desk   |   16 Sep 2021 8:03 AM GMT
హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
X
హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఈ ఏడాదికి మాత్రమే ఓకే చెప్పింది. ఇప్పటికిప్పుడు ప్రత్యామ్మాయ ఏర్పాట్లు కష్టమని తెలంగాణ ప్రభుత్వం వాదించింది. అసలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాల తయారీని ముందే కంట్రోల్ చేసి ఉండాల్సిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నిమజ్జనానికి ఎక్కువ రోజులు సమయం లేదు కాబట్టి ఈ ఒక్క ఏడాదికి అనుమతిచ్చింది.

హుస్సేన్ సాగర్ లో పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి వీల్లేదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు నిమజ్జనానికి ఈ సంవత్సరం మాత్రమే అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. ‘హైదరాబాద్ లో ఇది కొత్తగా వస్తున్న సమస్య కాదని.. చాలా ఏళ్లుగా ఉందన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీరు సంతృప్తికరంగా లేదని.. ఇదే చివరి అవకాశమని’ స్పష్టం చేశారు.

సుందరీకరణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలకు అవకాశం కల్పించడం వల్ల ఆ నిధులు వృథా అవుతున్నాయని ఎన్వీ రమణ ఆక్షేపించారు.