Begin typing your search above and press return to search.

భార్య కి రూ.2. కోట్ల భరణం చెల్లిస్తావా .. జైలుకి వెళ్తావా : ఓ భర్త కి సుప్రీం కోర్టు చివరి అవకాశం

By:  Tupaki Desk   |   22 Feb 2021 7:50 AM GMT
భార్య కి  రూ.2. కోట్ల భరణం చెల్లిస్తావా .. జైలుకి వెళ్తావా : ఓ భర్త కి సుప్రీం కోర్టు చివరి అవకాశం
X
భార్య నుండి విడాకులు పొందిన భర్త , భార్యకి భరణం అలాగే నెల వారి ఖర్చులకి విడాకుల సమయంలో ఒప్పుకున్న కాడికి ఇవ్వాల్సిన భాద్యత భర్తదే. అయితే , విడాకులు తీసుకునే సమయంలో ఆ షరతులకు ఒప్పుకొని గత కొన్ని నెలలుగా నెలవారీ ఖర్చులకి గానీ, భరణం లో ఇవ్వాల్సిన సొమ్మును ఇవ్వకపోవడం తో సుప్రీం కోర్టు ఆ భర్తకి చివరి అవకాశం ఇచ్చింది. రూ.2. కోట్ల భరణంతో పాటు నెలవారీ మెయింట్ నెన్స్ కింద రూ.1.75 లక్షలు నాలుగు రోజుల్లోగా చెల్లించాల్సిందిగా సూచించింది.

అలాగే , చెప్పిన సమయంలోగా ఈ మొత్తాన్ని చెల్లించలేని పక్షంలో జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. భర్త రెండేళ్లుగా భరణం చెల్లింపునకు సమయం కోరుతున్నట్లు ధర్మాసనం అభిప్రాయపడింది. మహిళ తరపున హాజరైన న్యాయవాది ఆమె భర్త పూర్తి మొత్తాన్ని చెల్లించడానికి సమయం కోరింది. నాలుగు వారాల తరువాత అతను చెల్లించకపోతే తదుపరి విచారణలో జైలు శిక్ష విధించవచ్చునని తెలిపింది. నెలవారీ రూ .1,75,000 మెయింట్ నెన్స్, మరొకటి 2009 నుంచి బకాయిల నిర్వహణ రూ .2.60 కోట్లు, అందులో రూ.50లక్షల మొత్తాన్ని భార్యకు చెల్లించారని కోర్టు ఉత్తర్వులో తెలిపింది. భరణాన్ని చెల్లించాలంటూ కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అతను పట్టించుకోలేదంటూ మహిళ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. విడిపోయిన భార్య మెయింటెనెన్స్ కు సంబంధించి మొత్తాన్ని వెంటనే క్లియర్ చేయాల్సిందిగా భర్తను కోర్టు ఆదేశించింది. ఒకవేళ ఆ మొత్తాన్ని చెల్లించకపోతే అరెస్టు ఉత్తర్వులు లేదా జైలు శిక్షను విధించే అవకాశం ఉందని వెల్లడించింది.