Begin typing your search above and press return to search.

సుప్రీం కోర్టులో జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ

By:  Tupaki Desk   |   3 Sept 2020 2:00 PM IST
సుప్రీం కోర్టులో జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ
X
ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలన్న జగన్ ప్రభుత్వం సంకల్పం ఆలస్యమయ్యేలా ఉంది. తాజాగా ఇంగ్లీష్ మీడియం అమలుపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది.

ఏపీలో 6వ తరగతి వరకు ఇంగ్లీష్ ను తప్పనిసరి చేస్తే ఏపీ ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసింది. దీనిపై కొందరు హైకోర్టుకు ఎక్కారు. హైకోర్టు ఈ జీవోను కొట్టివేసింది.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే విచారణ జరిపిన సుప్రీం కోర్టులో ప్రతివాదులు.. ఏపీలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయడం సరికాదని.. మాతృభాషలోనే బోధించాలని వాదించారు.

ఏపీ ప్రభుత్వం మాత్రం 6వ తరగతి వరకు తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన జీవోలను హైకోర్టు రద్దు చేయడం సరికాదని వాదించింది. కేంద్రం తెచ్చిన విద్యాహక్కు చట్టంలో కూడా మాతృభాషలోనే విద్యాబోధన చేయాలని లేదని కోర్టుకు తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీం కోర్టు... హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించి పిటీషనర్ కు నోటీసులు ఇస్తామని తెలిపింది.