Begin typing your search above and press return to search.
క్రెడిట్ కార్డు కస్టమర్లకు సుప్రీంకోర్టు షాక్.. వారికెందుకు ఆ ప్రయోజనాలని ప్రశ్న
By: Tupaki Desk | 21 Nov 2020 4:00 AM GMTక్రెడిట్ కార్డు వినియోగదారులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డు ఉపయోగించుకొని వస్తువులు కొనుగోలు చేసిన వారికి మారటోరియం ప్రయోజనాలు ఎందుకు కల్పించారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈఎంఐలు చెల్లింపులు, మారటోరియం విధింపుపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా లాక్‌డౌన్‌తో చాలా మంది ఉపాధి కోల్పోయారు. అటువంటి వారు లోన్ లు చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వీరికి వెసలుబాటు కల్పించేందుకు కేంద్రం మారటోరియం విధించిన విషయం తెలిసిందే. లోన్ల పై ఉన్న చక్రవడ్డీ ని భరించేందుకు కూడా కేంద్రం అంగీకరించింది.
అయితే క్రెడిట్ కార్డుతో ఇంట్లో వస్తువులు కొనుగోలు చేసి నెల నెలకు ఈఎంఐలు కడుతున్నవారి లోన్లపై మారటోరియం ఎందుకు విధించాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. క్రెడిట్ కార్డు వినియోగదారులు రుణగ్రహీతల కిందకు రారని పేర్కొంది. వారు రుణాలు పొందలేదని, కొనుగోళ్లు చేశారని తెలిపింది. పర్సనల్ లోన్ మొదలు క్రెడిట్ కార్డు వినియోగదారుల వరకు ఈ లోన్ మారటోరియం వర్తిస్తుందని ఆర్బీఐ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. ఈ నిర్ణయాన్ని పలువురు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.
చక్రవడ్డీ మాఫీకి కేంద్రం సుముఖంగా ఉంది. అయితే ఆర్బీఐ అంగీకరించడం లేదు. చక్రవడ్డీని మాఫీ చేస్తే ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్బీఐ తెలిపింది. మెసేజ్ వచ్చిందని... తాను క్రెడిట్ కార్డు వినియోగదారుడిని అని, తనకు ఇటీవల చక్రవడ్డీ మాఫీ ఎక్స్‌గ్రేషియాకు సంబంధించి సందేశం వచ్చిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు లో తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు 'క్రెడిట్ కార్డు వినియోగదారులు కొనుగోళ్లు జరుపుతున్నారు. వారు రుణాలు తీసుకోలేదు. వారికి ప్రయోజనం అవసరం లేదు' అని తెలిపింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో క్రెడిట్ కార్డు తో కొనుగోలు జరిపిన వారికి ఇక మారిటోరియం ప్రయోజనాలు ఎటువంటివి దక్కవు.నిజం గా వారికి ఇది పెద్ద షాకే.