Begin typing your search above and press return to search.

ఉజ్జయినీ మహాకాళేశ్వరుడి ఆలయంలో ఇకపై ఆలా చేయొద్దు

By:  Tupaki Desk   |   2 Sep 2020 4:00 AM GMT
ఉజ్జయినీ మహాకాళేశ్వరుడి ఆలయంలో ఇకపై ఆలా చేయొద్దు
X
దేశంలోని దేవాలయాలన్ని ఒక ఎత్తు.. జ్యోతిర్లింగాలు మరో ఎత్తు. జ్యోతిర్లింగం ఏదైనా.. వాటిని భక్తులు ముట్టుకోవటమే కాదు.. చాలాచోట్ల భక్తులే స్వయంగా అభిషేకం చేయటానికి అవకాశం ఉంటుంది. ఉజ్జయినీ మహాకాళేశ్వరుడి ఆలయానికి సంబంధించి తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పను ఇచ్చింది. ఇకపై.. భక్తులు ఎవరిని గర్భగుడిలోకి రానివ్వరు. అంతేకాదు.. జ్యోతిర్లింగాన్ని ముట్టుకోనివ్వరు. ఎందుకిలాంటి తీర్పును ఇచ్చినట్లు? అన్న విషయంలోకి వెళితే..

ఉజ్జయినీ మహాకాళేశ్వరుడి జ్యోతిర్లింగం అంతంతకూ క్షీణిస్తోంది. ఈ క్రమంలో దీనిపై వ్యాజ్యం ఒకటి సుప్రీంకోర్టులో నడుస్తోంది. ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరుణ్ మిశ్రా తన జీవితంలో చివరి తీర్పును ఉజ్జయినీ మహాకాళేశ్వరుడి ఆలయం మీద ఇవ్వటం గమనార్హం. జ్యోతిర్లింగానని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్న ఆయన.. భక్తుల్ని గర్భగుడిలోకి రానిచ్చే అంశంపైనా స్పందించారు. ఇకపై.. భక్తుల్ని రానివ్వొద్దని.. భక్తులు ఎవరూ జ్యోతిర్లింగాన్ని తాకేందుకు వీల్లేదన్నారు.

సంప్రదాయ కార్యక్రమాల్లో భాగంగా పూజారులు మాత్రమే జ్యోతిర్లింగాన్ని తాకేందుకు అనుమతి ఉంది. పవిత్ర కైంకర్యాల్ని నిర్వహించే క్రమంలో వారు దానిని తాకొచ్చు. అంతేకాదు.. ఇప్పటివరకు అభిషేకాల కోసం అన్ని వస్తువుల్ని అభిషేకం చేసేందుకు అనుమతి ఉండేది. ఇకపై.. స్వచ్ఛమైన పాలు.. అది కూడా కొన్ని సందర్భాల్లో మాత్రమే అభిషేకానికి అనుమతి ఉంటుందని తేల్చారు.

భక్తులు.. ఆలయ కమిటీల తరపున పూజారులు మాత్రమే ఈ కైంకర్యాల్ని నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అంతేకాదు.. గర్భగుడిలో నిఘా వ్యవస్థను మరింత పటిష్టంలో భాగంగా.. 24 గంటల పాటు కెమేరాతో రికార్డు చేయాలన్నారు. ఆ క్లిప్పింగుల్ని ఆరునెలల పాటు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని.. ఈ విషయంలో ఎవరైనా సుప్రీం తీర్పునకు భిన్నంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు ఉంటాయిని స్పష్టం చేశారు.