Begin typing your search above and press return to search.
మోడీ సర్కారుపై సుప్రీం తీవ్ర ఆగ్రహం.. మీరు ఆపుతారా? మమ్మల్ని ఆపమంటారా?
By: Tupaki Desk | 11 Jan 2021 9:30 AM GMTదేశ అత్యున్నత న్యాయస్థానానికి కోపం వచ్చింది. గడిచిన కొన్ని వారాలుగా దేశ రాజధాని శివారులో గుడారాలు వేసుకొని.. నిరసన చేస్తున్న రైతుల డిమాండ్లపై కేంద్రం ఇప్పటికి పరిష్కారాన్ని వెతకపోవటాన్ని తప్పు పట్టింది. కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రానికి.. రైతులకు మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించటంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు సీజేఐ ఏస్ఏ బోబ్డే ధర్మాసనం. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో చట్టాల అమలును కొంతకాలంగా ఆపలేరా? అని సూటిగా అడిగిన న్యాయస్థానం.. లేదంటే కోర్టునే ఆ పని చేయమంటారా? అని అడిగేశారు. దీంతో.. వ్యవసాయ చట్టాల అమలుపై కేంద్ర సర్కారు మొండితనానికి భారీ షాక్ తగిలినట్లుగా చెప్పాలి.
సాగు చట్టాలపై కేంద్రం.. రైతుల మధ్య జరుగుతున్న ప్రక్రియ విషయంలో తాము సంతోషంగా లేమన్న సుప్రీం ధర్మాసనం.. అసలు చర్చల్లో ఏం జరుగుతుందో తెలియటం లేదని.. ఆందోళనల్లో పాల్గొన్న కొందరురైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. మహిళలు.. పెద్ద వయస్కులు కూడా ఆందోళనలో పాల్గొన్నారన్నారు. నిరసనల్లో ఏం జరుగుతోంది? ఏదైనా తప్పు జరిగితే మనం అందరం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
తమ చేతులకు రక్తం అంటుకోవాలని తాము కోరుకోవటం లేదన్న ఆయన.. దేశమంతా కేంద్రం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయన్నారు. చట్టాల్ని రద్దు చేయాలని తాము చెప్పటం లేదని.. కాకుంటే పరిష్కారం కనుగొనడటమే ముఖ్యమన్నారు. ఇందులో భాగంగా చట్టాల అమలును కొంతకాలం నిలిపివేయగలరా? అని ప్రశ్నించింది. సమస్య పరిష్కారానికి కమిటీని ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొంది. ఈ కమిటీ నివేదిక ఇచ్చే వరకు వ్యవసాయ చట్టాల్ని నిలిపివేసే ఆలోచనలో ఉన్నట్లు ధర్మాసనం పేర్కొంది. అప్పటివరకు రైతులు తమ ఉద్యమాన్ని కొనసాగించుకోవచ్చని సుప్రీం వెల్లడించింది.
అయితే.. ఆందోళనల్ని మరో చోటుకు మార్చుకోవాలన్న అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని రైతుల కమిటీకి తెలియజేయాలని కోరింది. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం తరఫున ఈ కేసులో వాదనలు వినిపిస్తున్న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ.. ఏ చట్టమైనా ప్రాథమిక హక్కులు.. రాజ్యాంగ హక్కులు.. అందులోని నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తప్పించి చట్టాల్నినిలిపివేసే హక్కుకోర్టులకు లేదని పేర్కొంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కూడా పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఆందోళనలు సాగటం లేదని.. రెండు.. మూడు రాష్ట్రాల వారే వీటినినిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏమైనా.. రైతులు చేస్తున్న ఆందోళన విషయంలో సుప్రీం సీరియస్ గా ఉందన్న విషయం అర్థమైంది. మరి.. తాజాగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అయినా సరే.. కేంద్రం తన మొండితనాన్ని వెనక్కి తీసుకుంటుందా? అన్నది ఇప్పుడు ప్రశ్న. మరేం జరగుతుందో చూడాలి.