Begin typing your search above and press return to search.

రిపబ్లిక్ టీవీ కేసును తోసిపుచ్చిన సుప్రింకోర్టు

By:  Tupaki Desk   |   15 Oct 2020 5:32 PM GMT
రిపబ్లిక్ టీవీ కేసును తోసిపుచ్చిన సుప్రింకోర్టు
X
కృత్రిమంగా టీవీ రేటింగులను పెంచుకుంటున్నారనే వివాదాన్ని ఎదుర్కొంటున్న రిపబ్లిక్ టీవీ వేసిన కేసును సుప్రింకోర్టు కొట్టేసింది. వ్యూయర్ షిప్పుల రేటింగులను పెంచుకుంటోందనే ఆరోపణల విషయంలో సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తు రిపబ్లిక్ టీవీ యాజమాన్యం సుప్రింకోర్టులో కేసు వేసింది. అయితే ఈ విషయాన్ని ముందుగా ముంబాయ్ హైకోర్టులోనే తేల్చుకోమంటూ సుప్రింకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇప్పటికే ముంబాయ్ కోర్టులో పిటీషన్ విచారణలో ఉన్న కారణంగా ప్రత్యేకించి సుప్రింకోర్టులో కేసు విచారణ సాధ్యం కాదని తేల్చిచెప్పింది. మిగిలిన అందరి పౌరుల్లాగే మీరు కూడా ముంబాయ్ హైకోర్టులోనే కేసును తేల్చుకోమని టీవీ యాజమాన్యానికి చెప్పేసింది.

కృత్రమపద్దతుల్లో తన రేటింగులను పెంచుకుంటోందంటూ రిపబ్లిక్ టివీపై ముంబాయ్ పోలీసులు యాజమాన్యంపై కేసు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. వివిధ కారణాల వల్ల ముంబాయ్ పోలీసులకు టీవీ యాజమాన్యానికి మధ్య పెద్ద వివాదమే నడుస్తోంది. ముందేమో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధిపై రిపబ్లిక్ టీవీ ఎండి అర్ణబ్ గోస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత ప్రముఖ సినీనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మరణంపై కథనాలు ఇస్తున్నారనే కారణంతో యాజమాన్యానికి రెండోసారి గొడవయ్యింది. అంటే ఈ గొడవ ఇంకా కంటిన్యు అవుతునే ఉంది. రాజ్ పుత్ అనుమానస్పద మరణంపై కథనాల కారణంగా తమను పోలీసులు వేధిస్తున్నారంటూ ఇప్పటికే టీవీ యాజమాన్యంత పోలీసులపై కేసు నమోదు చేసింది.

పోలీసులతో గొడవలతువున్నాయని, తమపై పోలీసులు కక్షకట్టి వేధింపులకు గురిచేస్తున్నారంటూ యాజమాన్యం సుప్రింకోర్టులో కేసు వేసింది. పైగా టీఆర్పీ రేటింగుల స్కాంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేయటంతో కేసును ముంబాయ్ హైకోర్టులోనే తేల్చుకోమని పంపేసింది. ముంబాయ్ హైకోర్టులో కేసు విచారణలో ఉండగానే అదే కేసును తాము ఎలా టేకప్ చేస్తామని సుప్రింకోర్టు యాజమాన్యం తరపు లాయర్ హరీష్ సాల్వేని సూటిగా ప్రశ్నించింది. ఇప్పటికే కోవిడ్ -19 కేసుల విచారణలో జస్టిస్ చంద్రచూడ్, ఇందూ మల్హోత్రా, ఇందిరా బెనర్జీ త్రిసభ్య ధర్మాసనం బిజీగా ఉన్న కారణంగా టీవీ రేటింగుల వివాదంలో ఇతర ఛానళ్ళతో పాటు ముంబాయ్ హైకోర్టులోనే పరిష్కరించుకోమని పంపేసింది.