Begin typing your search above and press return to search.
రామోజీరావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
By: Tupaki Desk | 12 Oct 2018 8:39 AM GMTఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రామోజీరావు కోడలు శైలజా కిరణ్ ఎండీ ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాల విచారణపై స్టే పొడిగించాలంటూ దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. క్రిమినల్ ప్రొసీడింగ్స్ కింద తమపై చర్యలు తీసుకోవద్దని మార్గదర్శి సంస్థ సుప్రీంకు విన్నవించగా నిరాకరించింది. విచారణ జరగకుండా స్టే ఎలా ఇస్తామని ప్రశ్నించింది.
మార్గదర్శిలో నిధుల దుర్వినియోగంపై 2006లోనే కోర్టులో పిటీషన్ దాఖలైంది. రామోజీరావు సుప్రీంకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అయితే తాజాగా క్రిమినల్ కేసుల్లో స్టే ఆరునెలలకు మించకూడదని సుప్రీం తేల్చిచెప్పింది. దీంతో మార్గదర్శిపై ఉన్న స్టే తొలిగిపోయింది. తదుపరి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కు దారులు తెరిచాయి. స్టేపై మార్గదర్శి చిట్ ఫండ్స్ సుప్రీం తలుపుతట్టగా.. తాజాగా స్టే ఇవ్వడం సాధ్యం కాదని చీఫ్ జస్టిస్ రంజన్ గోగాయ్ ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై తెలంగాణ సర్కారు స్పందన కోరగా.. గడువు కావాలని కోరింది. అవసరమైతే హైకోర్టుకు వెళ్లవచ్చని సుప్రీం మార్గదర్శికి సూచించింది.
కాగా సుప్రీం కోర్టు స్టే తొలగించడంపై కేసును వెలికి తీసిన ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చారే కానీ.. తెలంగాణ ప్రభుత్వాన్ని చేర్చలేదని వివరించారు. ఈ కేసులో డిపాజిటర్లకు డబ్బు తిరిగి చెల్లించినా క్రిమినల్ కేసులో విచారణ, శిక్ష మాత్రం తప్పవని ఉండవల్లి వివరించారు. రామోజీరావు చేసిన నేరానికి రెండింతల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష పడుతుందని ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.