Begin typing your search above and press return to search.
నిపుణుల కమిటీ నివేదిక సారాశం: అదానీ గ్రూప్ కు క్లీన్ చిట్
By: Tupaki Desk | 19 May 2023 6:23 PM GMTపెను సంచలనంతో పాటు.. లక్షలాది కోట్ల మార్కెట్ సొమ్ము ఇట్టే ఆవిరి అయ్యేలా చేయటమే కాదు.. దేశీయ స్టాక్ మార్కెట్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిన హిండెన్ బర్గ్ రిసెర్చ్ రిపోర్టు ఆరోపణల్లో నిజమెంత? వాస్తవాల మాటేమిటి? లాంటి సందేహాలకు సమాధానాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ ఏర్పాటు కావటం తెలిసిందే. ఈ కమిటీ తన నివేదికను అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించింది. ఈ సందర్భంగా అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ లో కృత్రిమ వ్యాపార ధోరణి కనిపించలేదని పేర్కొంది.
ఈ కమిటీలో సభ్యులుగా ఓపీ భట్.. జస్టిస్ జేపీ దేవధర్.. కేవీ కామత్.. నందన్ నీలేకని.. సోమశేఖర్ సుందరేశన్ లను నియమించారు. ఈ కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించగా.. దాన్ని ప్రజల అందుబాటులోకి సుప్రీం తీసుకొచ్చింది. అయితే.. ఏది ముందు.. ఏది తర్వాత అనే అంశాన్ని నిర్ధారించలేని సందిగ్థావస్థలో పడినట్లుగా పేర్కొన్నారు.
2020 నుంచి దర్యాప్తులో ఉన్న పదమూడు విదేశీ సంస్థల యాజమాన్యాన్ని సెబీ నిర్ణయించలేకపోయినట్లుగా తెలిపింది. తాజా నివేదిక సారాంశాన్ని చూస్తే.. అదానీ గ్రూప్ కంపెనీలకు క్లీన్ చిట్ లభించినట్లుగా మారింది. అదానీ - హిండెన్ బర్గ్ సమస్యను చర్చించేందుకు చాలా అంతర్జాతీయ సెక్యూరిటీస్ సంస్థలతో సంప్రదించేందుకు తాము ప్రయత్నించామని కమిటీ పేర్కొంది. అయితే.. సదరు సంస్థలు కానీ.. బ్యాంకులు కానీ తమతో మాట్లాడటానికి ఇష్టపడలేదని వెల్లడించింది.
అదానీ గ్రూప్ తో తమకు వ్యాపార సంబంధాలు ఉన్నందున తమ ఆసక్తుల సంఘర్షణ ఏర్పడే వీలుందని పలు అంతర్జాతీయ సంస్థలు చెప్పినట్లుగా నివేదికలో పేర్కొన్నారు. తమ విచారణలో రెగ్యులేటరీ ఫెయిల్యూర్లు ఉన్నట్లుగా తాము చేసిన ప్రాథమిక దర్యాప్తులో కనిపించలేదని స్పష్టం చేసింది. అదానీ స్టాక్స్ విషయంలో 849 ఆటోమేటెడ్ సస్పిషియస్ అలర్టులను సిస్టం క్రియేట్ చేసినట్లు తెలిపింది.
నాలుగు నివేదికలను సెబీకి సమర్పించినట్లుగా చెప్పిన నిపుణుల కమిటీ.. వీటిల్లో రెండింటిని హిండెన్ బర్గ్ నివేదికకు ముందు. మరో రెండు ఆ తర్వాత అందజేశారని వెల్లడించింది. హిండెన్ బర్గ్ నివేదిక విడుదలైన తర్వాత అదానీ లిస్టెడ్ స్టాక్స్ లో రిటైల్ మదుపరుల కార్యకలాపాలు పెరిగిన విషయాన్ని పేర్కొన్నారు. చట్టాలతో నియంత్రణ వైఫల్యం ఉందా? లేదా? అన్నది నిర్దారించటం కష్టమన్నారు. ‘పటిష్టమైన విధానాన్ని అమలు చేయాల్సి ఉంది. సెబీ ఫాలో అవుతున్న లెజిస్టేటివ్ పాలసీకి అనుగుణంగా ఈ ఎన్ ఫోర్సు మెంట్ పాలసీ ఉండాలి. హిండెన్ బర్గ్ నివేదిక విడుదలకు ముందు కొన్ని సంస్థలు షార్ట్ పొజిషన్స్ తీసుకన్నాయి. హిండెన్ బర్గ్ నివేదిక విడుదల తర్వాత ఆ సంస్థలు లాభపడ్డాయి. ఫారిన్ పోర్టు ఫోలియో ఇన్వెస్ట్ మెంట్ కేటగిరిలో దాదాపు 42 మంది మదుపరుల వివరాలు మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం అందుబాటులో ఉన్నాయి’’ అని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. అదానీ గ్రూప్ మీద సెబీ దర్యాప్తు గడువును సుప్రీంకోర్టు ఆగస్టు పద్నాలుగు వరకు పెరగటం తెలిసిందే.
సుప్రీంకోర్టు తనకు అందిన నివేదికన ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత అదానీ ఎంటర్ ప్రైజస్ స్టాక్ ధర 1.73 శాతం పెరిగింది. అదానీ పోర్టు స్టాక్ ధర పెరిగింది. అదానీ పవర్ ఎక్కువగా పెరిగితే.. అదానీ ఎనర్జీ.. అదానీ విల్మార్ కూడా పెరిగాయి. ఒక్క అదానీ ట్రాన్స్ మిషన్ షేరు ధర స్వల్పంగా మాత్రమే పెరిగింది.