Begin typing your search above and press return to search.
ఎక్కడపడితే అక్కడ , ఎలా అంటే అలా నిరసన వ్యక్తం చేస్తాం అంటే కుదరదు .. సుప్రీంకోర్టు స్పష్టీకరణ
By: Tupaki Desk | 13 Feb 2021 10:17 AM GMTఈ దేశంలో నిరసన తెలపడానికి ఎవరికైనా అవకాశం ఉంది. నిరసన తెలిపేందుకుగల హక్కుపై సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. దీనికి కొన్ని పరిమితులు ఉంటాయని పేర్కొంది. 2019 ఫిబ్రవరిలో లో సీఏఏ కి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్ద కొన్ని రోజులపాటు సుదీర్ఘంగా జరిగిన ఆందోళనపై 12 మంది యాక్టివిస్టులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ని కోర్టు కొట్టివేసింది.
ప్రొటెస్ట్ చేసే హక్కు ఎప్పుడైనా, ఎక్కడైనా ఉంటుందనలేమని, తరచూ అప్పటికప్పుడు ఆందోళనలు జరుగుతున్న విషయం వాస్తవమేనని, కానీ బహిరంగ కూడళ్లలో అనేక రోజులపాటు ఆందోళనలు జరిగితే అది ఇతరుల హక్కులకు భంగపరచడమే అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. న్యాయమూర్తులు ఎస్.కె. కౌల్, అనిరుధబోస్, కృష్ణమురారిలతో కూడిన బెంచ్ ఈ విశిష్టమైన తీర్పు ఇచ్చింది. ఈ నెల 9 న ఈ రివ్యూ పిటిషన్ పై నిర్ణయం తీసుకున్నప్పటికీ గతరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. నెలలతరబడి జరిగే ఆందోళనలను అంగీకరించే ప్రసక్తి లేదని గత ఏడాది అక్టోబరులోనే సుప్రీంకోర్టు పేర్కొంది.