Begin typing your search above and press return to search.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ చంద్రచూడ్ గురించి ఇవి తెలుసా?
By: Tupaki Desk | 20 Nov 2022 5:41 AM GMTదేశంలోనే అత్యుత్తమ న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ గా ఉండటం అంటే మాటలు కాదు. ఆ స్థానానికి చేరుకోవాలంటే ప్రతిభ ఉంటేనే సరిపోదు. దానికి మించిన లక్ కూడా ఉండాలి. అలాంటి అరుదైన అవకాశం అతి తక్కువ మందికే లభిస్తుంది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి.. కొడుకులు ఇద్దరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా వ్యవహరించే అపురూప.. అరుదైన అవకాశం లభించిందంటే అది చంద్రచూడ్ కుటుంబానికే. విలువలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటూ.. వివాదాలకు దూరంగా వ్యవహరిస్తూ.. తాము నమ్మిన దానికి కట్టుబడి ఉండటమే తప్పించి మరో ఆలోచనకు అవకాశం ఇవ్వని కుటుంబంగా చంద్రచూడ్ ఫ్యామిలీ నిలుస్తుంది.
ఇటీవల సీజేఐ పదవిని చేపట్టిన యశ్వంత్ చంద్రచూడ్ నుంచి తెలుసుకోవాల్సిన.. నేర్చుకోవాల్సిన అంశాలెన్నో. అన్నింటికి మించి ఇంత పెద్ద స్థానంలో ఉండి కూడా ఆయన రాత్రి ఎనిమిది గంటల సమయానికి ఇంటికి వెళ్లిపోతారు. రాత్రిపూట పార్టీలకు అస్సలంటే అస్సలు వెళ్లరు. ఉదయం మూడున్నర గంటల వేళలో నిద్ర లేచి కేసుల ఫైళ్లను క్షుణ్ణంగా చదవటం మొదలు పెడతారు. సుప్రీంకోర్టు జడ్జిగా వారంలో 250 కేసుల ఫైల్స్ చదవాల్సి ఉంటుంది. వాటికి ఎంతో అధ్యయనం.. అంతకు మించి సమయం చాలా పడుతుంది. అందుకే.. ఆయన ఎక్కువగా బయట కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపరు. రోజూ గంట.. రెండు గంటల పాటు పుస్తకాలు చదవకుండా ఉండరు.
జస్టిస్ యశ్వంత్ చంద్రచూడ్ కు పిల్లులు అంటే చాలా ఇష్టం. ఆయన ఇంట్లో జోష్.. జోషువా పేర్లతో రెండు పిల్లులు ఉన్నాయి. వినమ్రంగా ఉండే తన తండ్రి మాజీ సీజేఐ జస్టిస్ వైవీ చంద్రచూడ్ నుంచి ఆ తీరును ఆయన ఒంటబట్టించుకున్నారు. అంతేకాదు.. తాను నేర్చుకున్న విలువలు.. ముంబయిలోని తమ ఇంట్లో పని చేసే పని మనిషి నుంచి నేర్చుకున్నట్లుగా చెప్పేందుకు అస్సలు వెనుకాడరు. తమ ఇంట్లో భీమ్ బాయి అనే పని మనిషి పని చేసేదని.. ఆమె చదువుకోలేదు కానీ చాలా కథలు చెప్కపేదని.. ఆమె దగ్గరే విలువల గురించి నేర్చుకున్నట్లుగా చెబుతారు. హోదాకు గర్వం తోడైతే ఆలోచనలు పక్కదారి పడతాయని ఆమె తనకు ఎప్పుడూ చెప్పేదని ఆమె గురించి గుర్తు చేసుకుంటూ చెబుతారు. ఆమె మాటల ప్రభావం తన మీద ఉందని చెబుతారు. అమ్మ.. నాన్న.. భార్య.. పిల్లలు.. అక్క వీళ్లే తన బలమని చెప్పే ఆయన..తన యోగా టీచర్ అనంత్ లిమాయే తన అథ్యాత్మిక ప్రయాణానికి ప్రేరణగా చెబుతారు.
తనకు స్ఫూర్తిగా హార్వర్డ్ లో క్రిమినల్ లా పాఠాలు బోధించిన లోతిక సర్కార్.. లింగ వివక్షకు వ్యతిరేకంగా పని చేసిన అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి రూత్ బ్యాడెర్ గిన్స్ బర్గ్ తనకు ఆదర్శం.. స్ఫూర్తిగా చెబుతారు. ఆధార్ కు సంబంధించిన ఒక కేసులో గోప్యత ప్రాథమిక హక్కు అన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. శబరిమలైలో మహిళలకు నిషేధం ప్రాథమిక హక్కులకు భంగమని చెప్పారు.
జస్టిస్ యశ్వంత్ చంద్రచూడ్ సతీమణి రష్మీ క్యాన్సర్ తో 2007లో మరణించారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. ఆ తర్వాత కొంతకాలానికి న్యాయవాది కల్పనాదాస్ ను పెళ్లి చేసుకున్నారు. పెంపుడు కూతుళ్లు ఇద్దరు దివ్యాంగులు. అన్నింటికి మించిన తన భార్య తనకు స్నేహితురాలు.. విమర్శకురాలిగా చెప్పేందుకు ఆయన వెనుకాడరు. న్యాయ వ్యవస్థకు మానవీయతను జోడించిన న్యాయమూర్తిగా అందరికి గుర్తు ఉండాలన్నదే తన లక్ష్యమని చెబుతారు. ఆయన తాను కోరుకున్న లక్ష్యానికి ఇప్పటికే చేరువయ్యారు. మరింత దగ్గరవుతారని ఆశిద్దాం.