Begin typing your search above and press return to search.

కేంద్రంపై సుప్రీం ఛీఫ్ అసంతృప్తి

By:  Tupaki Desk   |   26 Nov 2016 11:47 AM GMT
కేంద్రంపై సుప్రీం ఛీఫ్ అసంతృప్తి
X
సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి టీఎస్ ఠాకూర్ మ‌రోమారు న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు ద‌క్కుతున్న ప్రాధాన్యంపై అసంతృప్తి వ్య‌క్తంచేశారు. దేశ‌వ్యాప్తంగా హైకోర్టులు, ట్రిబ్యున‌ళ్ల‌లో ఉన్న ఖాళీల‌ను ప్ర‌భుత్వం భ‌ర్తీ చేయ‌క‌పోవ‌డంతో ప‌ని భారం పెరిగిపోవ‌డ‌మే కాకుండా, స‌త్వర న్యాయం ద‌క్క‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాజాగా జ‌రిగిన ఓ స‌మావేశంలో సీజే ఠాకూర్ మాట్లాడుతూ #హైకోర్టుల్లో ఇప్పుడు 500 మంది జ‌డ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. ఇప్పుడు మాకు కోర్టు రూములు ఉన్నాయి కానీ జ‌డ్జీలు లేరు. అడ్వాన్స్ రూలింగ్‌కు చైర్మ‌న్ లేడు.. సాయుధ బ‌ల‌గాల అప్పిలేట్ ట్రిబ్యున‌ల్‌కు చైర్మ‌న్ లేడు.. కాంపిటిష‌న్ క‌మిష‌న్‌కు చైర్మ‌న్ లేడు అని ఠాకూర్ వెల్ల‌డించారు. చాలా ప‌ద‌వులు ఖాళీగా ఉన్నాయ‌ని, వాటికి రిటైర‌వుతున్న మా స‌హ‌చ‌రుల‌ను నియ‌మించ‌డం నాకు చాలా బాధ క‌లుగుతోంది అని ఆయ‌న అన్నారు. ట్రిబ్యున‌ళ్ల‌లో స‌రైన వ‌స‌తులు కూడా లేక‌పోవ‌డంతో ఇప్పుడు ఏ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జీ కూడా వాటికి నేతృత్వం వ‌హించ‌డానికి ముందుకు రావ‌డం లేద‌ని ఠాకూర్ తెలిపారు.

ప్ర‌భుత్వం స‌రైన వ‌స‌తులు కూడా క‌ల్పించ‌డంలేద‌ని ఠాకూర్ ఆరోపించారు. ఇప్ప‌టికే 121కి పైగా నియామ‌కాలు జ‌రిగినా.. అందులో చాలావ‌ర‌కు ప్ర‌తిపాద‌న‌లు ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిపై కూడా ప్ర‌భుత్వం దృష్టిసారిస్తుంద‌ని ఆశిస్తున్నట్లు తెలిపారు. ట్రిబ్యునల్ చైర్మ‌న్‌కు క‌ల్పించాల్సిన క‌నీస వ‌స‌తులు క‌ల్పించ‌డానికీ ప్ర‌భుత్వం ముందుకు రాక‌పోవ‌డంతో చాలా మంది జ‌డ్జీలు ఆ ప‌ద‌వుల‌ను నిరాక‌రిస్తున్నారు అని ఠాకూర్ వెల్ల‌డించారు. నిబంధ‌న‌లు మార్చేవ‌ర‌కు హైకోర్టుల్లోని చీఫ్ జ‌స్టిస్‌ల‌ను కూడా ఈ ప‌ద‌వుల‌కు అర్హుల‌ను చేయండ‌ని గ‌తంలోనే తాను ప్ర‌భుత్వానికి లేఖ రాసిన‌ట్లు ఠాకూర్ గుర్తుచేశారు. అయితే సీజేఐ ఆరోప‌ణ‌లు ప్ర‌భుత్వం ఖండించింది. ఇప్ప‌టికే ఈ ఏడాది 120 మంది జ‌డ్జీల‌ను నియ‌మించిన‌ట్లు కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ తెలిపారు. నిబంధ‌న‌లు, అర్హ‌త‌ల ప్రకారం నియామ‌కాల ప్రక్రియ‌ను చేప‌డుతున్న‌ట్లు ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ వివ‌రించారు.