Begin typing your search above and press return to search.
సుప్రీం దెబ్బకు షాబుద్దీన్ ఇక జైలుకే..
By: Tupaki Desk | 30 Sep 2016 9:51 AM GMTఅతి ఎప్పుడూ మంచిది కాదు. ఈ విషయాన్ని చాలామంది రాజకీయ నాయకులు మర్చిపోతుంటారు. చేతిలో పవర్ ఉంటే చాలు ఏమైనా చేయొచ్చని ఫీల్ అవుతారే కానీ.. ఇదేమీ సినిమా కాదని.. రియల్ లైఫ్ అన్న లాజిక్‌ను మిస్ అవుతారు. తాజాగా అలాంటి పాయింట్ మిస్ అయిన ఆర్జేడీ మాజీ ఎంపీ షాబుద్దీన్ చేసిన అతికి ఇప్పుడు మళ్లీ జైలుకు వెళ్లాల్సిన దుస్థితి. డబుల్ మర్డర్ కేసులో యావజ్జీవ శిక్ష పడిన షాబుద్దీన్ పదకొండేళ్ల తర్వాత ఇటీవలే పాట్నా జైలు నుంచి బెయిల్ మీద విడుదల అయ్యారు.
రాకరాక వచ్చిన అవకాశాన్ని ఆయన వినియోగించుకుంటే బాగుండేది. కానీ.. బీహార్ లో ప్రస్తుతం ఉన్న ఆర్జేడీ మిత్రపక్షంగా ఉన్న నితీశ్ సర్కారు ఉండటం.. ఏళ్ల తర్వాత బయట ప్రపంచంలోకి అడుగు పెట్టిన షాబుద్దీన్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కోర్టు ఇచ్చిన బెయిల్ తో బయటకు వచ్చిన ఆయన.. దాదాపు రెండు వందల కార్లలో పెద్ద ఎత్తున అనుచర వర్గాన్ని వేసుకొని పాట్నా రోడ్ల మీద చేసిన హల్ చల్ తో నితీశ్‌సర్కారు సైతంచిక్కుల్లో పడింది.
ఏదో బయటకు వచ్చి బుద్ధిగా ఉంటాడని అనుకున్న దానికి భిన్నంగా షాబుద్దీన్ చేష్టలతో తల బొప్పికట్టిన నితీశ్ సర్కారు అతనికి కోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును కోరారు. ఈ సందర్భంగా నితీశ్ సర్కారుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బెయిల్ వస్తున్న సమయంలో ఏం చేశారంటూ సూటిగా ప్రశ్నించింది. ఈ కేసును తాజాగా విచారించిన సుప్రీం.. అతనికి కింది కోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. బెయిల్ మీద బయటకు వచ్చిన షాబుద్దీన్ మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజా పరిణామంతో బీహార్ ప్రభుత్వానికి కీలకమైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కు పెద్ద ఎదురు దెబ్బగా అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/