Begin typing your search above and press return to search.

ఐదు మతాల జ‌డ్జీల‌కు స‌వాల్‌గా ట్రిపుల్ త‌లాక్‌

By:  Tupaki Desk   |   11 May 2017 5:12 PM GMT
ఐదు మతాల జ‌డ్జీల‌కు స‌వాల్‌గా ట్రిపుల్ త‌లాక్‌
X
ముస్లిం మ‌త సాంప్ర‌దాయంలో మూడు సార్లు త‌లాక్ అంటే భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య బంధం తెగిపోయిన‌ట్లే. భ‌ర్త మూడుసార్లు త‌లాక్ అంటే ఇక భార్య చేసేది ఏమీ ఉండ‌దు. ఇప్పుడు ఆ ఆచారం ప‌ట్ల ముస్లిం మ‌హిళ‌లు వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఆ దురాచారానికి రాజ్యాంగ నిబ‌ద్ధ‌త ఉందా లేదా అని తెలుసుకునేందుకు ఇప్పుడు ఆ అంశంపై దేశ అగ్ర‌ న్యాయ‌మూర్తులు మేథోమ‌థ‌నం చేస్తున్నారు. అయితే తుది నిర్ణ‌యం వెలువ‌రిచే ఐదుగురు జ‌డ్జీల ధ‌ర్మాస‌నంలో ఐదుగురు వేర్వేరు మ‌తాల‌కు చెందిన వారు కావ‌డం విశేషం!

ఈ రోజు సుప్రీంకోర్టులో ఇవాళ వివాదాస్ప‌ద‌ ట్రిపుల్ త‌లాక్ అంశంపై విచార‌ణ మొద‌లైంది. ఆ ఆచారాన్ని కొన‌సాగించాలా లేదా, లేక‌ దానికి అంతం చెప్పాలా అన్న అంశం తేలేందుకు మ‌రికొంత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. కానీ ముస్లిం మ‌త సంప్ర‌దాయాన్ని ప‌రిశీలించేందుకు అత్యున్న‌త న్యాయ‌స్థానం మాత్రం అయిదు మ‌తాల‌కు చెందిన న్యాయ‌మూర్తుల‌తో కేసును ప‌రిశీలిస్తోంది. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జేఎస్ ఖేహ‌ర్ నేతృత్వంలో ఈ ధ‌ర్మాస‌నం ట్రిపుల్ త‌లాక్ అంశాన్ని విచారిస్తోంది. ఈ బెంచ్‌లో జ‌స్టిస్ ఖేహ‌ర్ సిక్కు మ‌త‌స్తుడు కాగా, జ‌స్టిస్ కురియ‌న్ జోసెఫ్ (క్రైస్త‌వ), జ‌స్టిస్ రోహింట‌న్ ఫారీ నారీమ‌న్ (పార్సి), జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్ (ముస్లిం), జ‌స్టిస్ యూయూ ల‌లిత్ (హిందూ) మ‌తాల‌కు చెందిన వారు కావ‌డం విశేషం. అత్యంత సంక్లిష్ట‌మైన సంప్ర‌దాయంపై అయిదు మ‌త విశ్వాసాల‌కు చెందిన న్యాయ‌మూర్తులు ఇచ్చే తీర్పు భార‌తీయ ముస్లిం మ‌హిళ‌ల‌కు ఆశాజ‌న‌కంగా మారే అవ‌కాశాలున్నాయని వినిపిస్తోంది.