Begin typing your search above and press return to search.

సుప్రీంకోర్టును పేల్చేస్తార‌ట‌

By:  Tupaki Desk   |   18 Aug 2015 5:27 AM GMT
సుప్రీంకోర్టును పేల్చేస్తార‌ట‌
X
భార‌త స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు ను పేల్చేస్తామంటూ బెదిరింపు ఈ మెయిల్ రావ‌డంతో ప్ర‌భుత్వం ఒక్క‌సారిగా అలెర్ట్ అయ్యింది. వాస్త‌వానికి ఈ బెదిరింపు ఈ మెయిల్ వ‌చ్చి నాలుగైదు రోజులు అయినా ర‌క్ష‌ణ కార‌ణాల దృష్ట్యా బ‌య‌ట‌కు ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. కోర్టు ప‌రిస‌ర‌రాల్లో భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేయ‌డంతో పాటు ప్ర‌తి ఒక్క‌రిని క్షుణ్ణంగా త‌నిఖీ చేసిన త‌ర్వాతే లోప‌ల‌కు పంపుతున్నారు.

ఈ బెదిరింపు ఈ మెయిల్ ఎక్క‌డ నుంచి వ‌చ్చిందో వెల్ల‌డికాలేదు. 1993 ముంబై వ‌రుస బాంబు పేళుళ్ల కేసులో నిందితుడైన యాకుబ్‌ మెన్‌ కు ఉరిశిక్ష ఖ‌రారు చేసిన న్యాయ‌మూర్తుల్లో ఒక‌రైన జ‌స్టిస్ దీప‌క్‌ మిశ్రాకు కొద్ది రోజుల క్రితం బెదిరింపు లేఖ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. పోలీసులు ఎంత భ‌ద్ర‌త పెంచినా స‌రే ఆయ‌న్ను హ‌త‌మారుస్తామ‌ని ఆ లేఖ‌లో పేర్కొన్నారు. దీంతో ఆయ‌న‌తో పాటు యాకుబ్‌ కు శిక్ష ఖ‌రారు చేసిన న‌లుగురు న్యాయ‌మూర్తుల‌కు పోలీసులు భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేశారు.