Begin typing your search above and press return to search.

కోహినూర్ మీద కేంద్రానికి సుప్రీం క్వశ్చన్?

By:  Tupaki Desk   |   9 April 2016 4:00 AM GMT
కోహినూర్ మీద కేంద్రానికి సుప్రీం క్వశ్చన్?
X
భారతీయుల్ని పాలించిన తెల్లోళ్లు మన సంపదనంతా దోచుకెళ్లటం చరిత్ర. అలా దోచుకెళ్లిన వాటిల్లో అత్యంత అపురూపమైనది కోహినూర్ వజ్రం. బ్రిటీష్ రాణి కిరీటంలో ఉన్న కోహినూర్ పుణ్యమా అని ఆ కిరీటానికే వన్నె వచ్చిన పరిస్థితి. మన దగ్గర నుంచి తీసుకెళ్లిన కోహినూర్ వజ్రాన్ని తిరిగి మనకిచ్చేయాలన్న డిమాండ్ ను భారత్ లోని ప్రజలు పెద్ద ఎత్తున కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇదే డిమాండ్ ను మన పొరుగునే ఉన్న పాకిస్థాన్.. బంగ్లాదేశ్ లు ఉన్నాయి.

ప్రజల గుండెల్లో కోహినూర్ వజ్రం మీద ఆశలు ఎన్నో ఉన్నా.. దానిపై కేంద్రం వైఖరి ఏమిటన్నది ఇప్పటివరకూ స్పష్టం కాలేదు. అయితే.. ఇదే సందేహాన్ని సుప్రీంకోర్టు ముందు పెట్టారు ఆల్ హ్యుమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ ఫ్రంట్ కు చెందిన ఒక వ్యక్తి. ఈ కేసును తాజాగా విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్.. కోహినూర్ పై కేంద్రానికి పలు ప్రశ్నలు వేశారు. బ్రిటన్ రాణి కిరీటంలో ఉన్న కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావటంలో ప్రభుత్వ వైఖరి ఏమిటని సూటిగా ప్రశ్నించారు. ‘‘కోహినూర్ వజ్రాన్ని తీసుకురావటానికి అవసరమై ప్రయత్నాన్ని చేశారా? అని ప్రశ్నించటం గమనార్హం.

అయితే.. కోహినూర్ వజ్రాన్ని భారత్ కు ఇవ్వాలన్న డిమాండ్ పై బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ స్పందిస్తూ.. ఆ వజ్రం రాణి కిరీటంలో ఉన్న నేపథ్యంలో.. దాన్ని తిరిగి ఇవ్వటం సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. మరి.. కోహినూర్ గురించి సుప్రీంకోర్టు వేసిన క్వశ్చన్లకు కేంద్రం ఏం బదులిస్తుందో చూడాలి.