Begin typing your search above and press return to search.

మత మార్పిడిలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   11 April 2021 7:00 AM IST
మత మార్పిడిలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
X
భారత్ లో 18 ఏళ్లు నిండిన ఏ వ్యక్తి అయినా.. తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని.. అనుసరించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. బలవంతపు మతమార్పిళ్లను, చేతబడి వంటి తాంత్రిక విద్యను కట్టడి చేయడానికి తగిన చర్యలు తీసుకునేలా కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటీషన్ పైవిచారణ సందర్భంగా ధర్మాసనం ఈ స్పష్టతనిచ్చింది.

జస్టిస్ లు ఆర్ఎఫ్ నారీమన్, బీఆర్ గవాయి, హృషికేష్ రాయ్ తో కూడిన బెంచ్ దీనిపై విచారణ చేపట్టింది. ఇలాంటి పిటీషన్ ను దాఖలు చేసినందుకు న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్, ఆయన తరుఫున వాదనలు వినిపించిన న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణపై ఈ సందర్భంగా ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

18 సంవత్సరాలు నిండిన ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించకూడదా? అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇందుకు ఎలాంటి కారణం లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీంతో తన పిటీషన్ ను వెనక్కి తీసుకోవడానికి అనుమతించాలని న్యాయవాది కోర్టును కోరారు.

దీనికి న్యాయస్థానం నిరాకరిస్తూ పిటీషన్ ను తోసిపుచ్చింది. బలవంతుపు మతమార్పిడులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,21,25 కింద నేరం, బలవంతపు మత మార్పిళ్లను, తాంత్రిక విద్యలను కట్టడి చేయడంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని అశ్వినీ ఉపాధ్యాయ్ కోర్టులు ఈ పిటీషన్ దాఖలు చేశారు. బలవంతపు మతమార్పిడులపై ఒక కమిటీని నియమించాలని కోరారు. ఈ మేరకు ఈ పిటీషన్ ను విచారించిన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.