Begin typing your search above and press return to search.

అది ఉద్యోగి హక్కు.. వడ్డీతో చెల్లించాలి: సుప్రీం

By:  Tupaki Desk   |   26 Feb 2021 8:00 AM GMT
అది ఉద్యోగి హక్కు.. వడ్డీతో చెల్లించాలి: సుప్రీం
X
సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పునిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పింఛన్లను హక్కులుగా సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

జీతాలు, పింఛన్ల చెల్లింపును ఆలస్యం చేసిన ప్రభుత్వం సహేతుకమైన వడ్డీతో చెల్లించాలని సూచించింది. మాజీ జిల్లా.. సెషన్స్ జడ్జీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వివరణాత్మక ఉత్తర్వులను ఇచ్చింది.

2020 మార్చి-ఏప్రిల్ మధ్య వాయిదా వేసిన జీతాన్ని సంవత్సరానికి 12శాతం చొప్పున వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. అలాగే 2020 మార్చి నెలలో వాయిదా వేసిన పింఛన్ ను సైతం వడ్డీతో చెల్లింపులను జరపాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం దృష్ట్యా 2020 మార్చి-ఏప్రిల్ మధ్య ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల జీతం, పింఛన్ ను కొంతకాలం వాయిదా వేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఏప్రిల్ తర్వాత వైద్య, ఆరోగ్య, పారిశుధ్య కార్మికుల పూర్తి జీతాలను ప్రభుత్వం పునరుద్ధరించింది.

ఈ క్రమంలోనే మాజీ జిల్లా, సెషన్స్ జడ్జి హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ఇందులో నిలిపివేసిన జీతాలు.. పింఛన్లను చెల్లించాలని డిమాండ్ చేయడమే కాకుండా.. ప్రతి ఉద్యోగికి జీతం.. పింఛన్ ప్రధాన హక్కులుగా పేర్కొన్నారు.