Begin typing your search above and press return to search.

లఖీంపూర్ కేసు : సాక్షులే లేరా.. యూపీ సర్కార్ పై సుప్రీం ఆగ్రహం !

By:  Tupaki Desk   |   20 Oct 2021 1:30 PM GMT
లఖీంపూర్ కేసు : సాక్షులే లేరా.. యూపీ సర్కార్ పై సుప్రీం ఆగ్రహం !
X
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లఖీంపూర్ ఖేరీ ఘటన, అనంతర పరిణామాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ సర్కారుపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం నాటి విచారణలో యూపీ సిట్ దర్యాప్తు జరుపుతోన్న తీరును, ఆలస్యానికి చెబుతోన్న కారణాలను సీజేఐ బెంచ్ తప్పుపట్టింది.అంత పెద్ద ఘటనలో కేవలం నలుగురే సాక్షులా  యూపీ సర్కారు వారి సిట్ ఏం చేస్తున్నట్లు, హింసాకాండను చూసిన సాక్షులను గుర్తించడంలో ఎందుకు ఆలస్యమవుతోంది, క్రైమ్ సీన్ రీ కన్స్ట్రక్షన్ అంటున్నారు. సెక్షన్ 164 కింద జరిగే సీన్ రీ కన్స్ట్రక్షన్.. సాక్ష్యాల సేకరణకు అడ్డంకా  మీ తీరు చూస్తే కేసును కావాలనే సాగదీస్తున్నట్లు అనిపిస్తోంది. అయితే ఈ కేసును ఓ అంతులేని కథగా మేం వదిలేయబోవడం లేదని మీరు గుర్తుంచుకోండి..అంటూ యోగి సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీ జిల్లాలో ఈనెల 3న రైతులపై జరిగిన హింసాకాండకు సంబంధించి కేసులను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్ సూర్యకాత్, జస్టిస్ మిమా కోహ్లితో కూడిన సుప్రీం ధర్మాసనం విచారిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తేని కొడుకు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడు కావడం, సాగు చట్టాలపై రైతుల నిరసనలు ఇంకాస్త తీవ్రతరమైన నేపథ్యంలో ఈ కేసుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైతులు సాగిస్తోన్న ఉద్యమంలో ఈ ఘటన చివరిగా అక్టోబర్ 8న లఖీంపూర్ కేసును పరిశీలించిన కోర్టు.. మధ్యలో దసరా సెలవులు రావడంతో మళ్లీ ఈ రోజు నుంచి విచారణ పున:ప్రారంభించింది. యూపీ సర్కారు తరఫున ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సర్కారు చెప్పిన పలు వివరణలకు కోర్టు అభ్యంతరం చెప్పింది.

రెండు వారాల వ్యవదిలో 10 మంది నిందితులను అరెస్టు చేశామని, నలుగురు వ్యక్తుల సాక్ష్యాలను రికార్డు చేశామని యూపీ సర్కారు తెలపగా, దర్యాప్తు నిదానంగా సాగుతుండటం, సాక్ష్యాల సేకరణలో ఆలస్యాన్ని కోర్టు ఎత్తిచూపింది. మొత్తం 34 మంది సాక్షులను విచారించినా, అందులో కేవలం నలుగురి స్టేట్మెంట్లను మాత్రమే రికార్డు చేయడమేంటని కోర్టు ప్రశ్నించింది. సాక్షుల భద్రతకు యూపీ సర్కారే భరోసా కల్పించాలని పేర్కొంది. లఖీంపూర్ హింస కేసును యూపీ ప్రభుత్వం కావాలనే తాత్సారం చేస్తున్నట్లుగా అనిపిస్తోందంటూ సీజేఐ బెంచ్ ఘాటు వ్యాఖ్యలు చేసింది.