Begin typing your search above and press return to search.

అవినాశ్‌ బెయిల్‌ రద్దుపై సుప్రీంకోర్టు ఏమందంటే!

By:  Tupaki Desk   |   9 Jun 2023 5:28 PM GMT
అవినాశ్‌ బెయిల్‌ రద్దుపై సుప్రీంకోర్టు ఏమందంటే!
X
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు లో మే 31న తెలంగాణ హైకోర్టు కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి కి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అవినాశ్‌ కు పలు షరతులు విధించింది. ప్రతి శనివారం సీబీఐ విచారణ కు హాజరు కావాలని అవినాశ్‌ ను ఆదేశించింది. సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని షరతులు విధించింది.

ఈ నేపథ్యంలో వైఎస్‌ అవినాశ్‌ బెయిల్‌ ను రద్దు చేయాలని వైఎస్‌ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ ను జూన్‌ 13న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేర కు జూన్‌ 9న ఈ పిటిషన్‌ ను సునీత తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూత్రా సుప్రీంకోర్టు ముందు మెన్షన్‌ చేశారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, రాజేష్‌ బిందాల్‌ లతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ ముందు పిటిషన్‌ లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అవినాశ్‌ బెయిల్‌ రద్దు కోరుతూ తాము దాఖలు చేసిన పిటిషన్‌ ను అత్యవసరంగా విచారించాలని సిద్ధార్థ్‌ లూద్రా కోరారు. ఈ సందర్భంగా లూథ్రా వాదనలు వినిపించారు. అవినాశ్‌ రెడ్డి.. వివేకా హత్యలో ప్రధాన కుట్రదారుడ ని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆయన కడప ఎంపీ గా ఉన్నారు. ఆయన ను రాష్ట్ర ప్రభుత్వం రక్షిస్తుందని కోర్టుకు నివేదించారు. అంతేకాకుండా సీబీఐ విచారణ కు అడ్డు తగులుతుందన్నారు.

తల్లి అనారోగ్యం పేరు తో కర్నూలులో తిష్ట వేసిన అవినాశ్‌ రెడ్డి అక్కడ తన అధికార బలాన్ని చూపాడని పేర్కొంది. ఈ క్రమం లో సీబీఐ విచారణకు నాలుగుసార్లు డుమ్మా కొట్టారని కోర్టు దృష్టికి తెచ్చారు. అవినాశ్‌ పై మోపిన అభియోగాలన్నీ చాలా కీలకమైనవన్నారు.

నిందితుడి అభ్యంతరాలనే తెలంగాణ హైకోర్టు పరిగణన లోకి తీసుకుందని.. సీబీఐ సేకరించిన సాక్ష్యాల ను తెలంగాణ హైకోర్టు పరిగణన లోకి తీసుకోలేదని సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ్‌ లూద్రా సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. సీబీఐ విచారణ నుంచి తప్పించుకోవడానికి తన తల్లికి శస్త్రచికిత్స పేరిట కడప ఎంపీ డ్రామా ఆడారని కోర్టు కు వెల్లడించారు.

నిర్దేశించిన చట్టానికి విరుద్ధంగా నిందితుల కు ముందస్తు బెయిల్‌ ను హైకోర్టు అనుమతించిందని పిటిషన్‌ లో పేర్కొన్నారు. హైకోర్టు మినీ ట్రయల్‌ నిర్వహించి, ఫలితాలు ఇచ్చిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అవినాశ్‌ రెడ్డి బెయిల్‌ ను రద్దు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో జూన్‌ 13ను ఈ పిటిషన్‌ ను విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.