Begin typing your search above and press return to search.

రైతు నిరసనపై సుప్రీం కమిటీ.. తప్పుకున్నదెవరు?

By:  Tupaki Desk   |   15 Jan 2021 7:30 AM GMT
రైతు నిరసనపై సుప్రీం కమిటీ.. తప్పుకున్నదెవరు?
X
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. రైతులతో చర్చించేందుకు ఓ నలుగురు సభ్యులతో కమిటీ వేశారు. వీరు రైతు సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతారు. వ్యవసాయ, ఆర్థిక నిపుణులతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు.

రైతులు, కేంద్రంతో చర్చించి సమస్య లోతుపాతులను పరిశీలించి పరిష్కార మార్గాలు కనిపెట్టాలి. అయితే ఈ కమిటీ ఏర్పాటుకు రైతు సంఘాలు అనుకూలంగా లేవనే అంశం సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా వెల్లడైంది.

ఈ ప్రత్యేక కమిటీలో భారతీయ కిసాన్ యూనియన్ కు చెందిన భూపిందర్ సింగ్ మాన్, షేత్కారీ సంఘటన్ కు చెందిన అనిల్ ఘన్వత్, వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్తలు అశోక్ గులాటి, డా. ప్రమోద్ కుమార్ జోషి ఉన్నారు.

అయితే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ నుంచి తప్పుకుంటున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ కు చెందిన భూపిందర్ సింగ్ మాన్ ప్రకటించడం సంచలనమైంది. తనకు పంజాబ్ రైతుల ప్రయోజనాల ముఖ్యమని.. తన నియామకంపై వచ్చిన ప్రతిస్పందనల నేపథ్యంలోనే తాను కమిటీ నుంచి తప్పుకుంటున్నానని ఆయన వెల్లడించారు.